శృంగార స‌న్నివేశంలో భ‌గ‌వ‌ద్గీత శ్లోకం.. Oppenheimer మూవీపై విమ‌ర్శ‌లు

-

ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చంతా ఓపెన్​హైమర్ సినిమా గురించే. ఈ సినిమా ఇండియాలో బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కొడుతోంది. డైరెక్ట‌ర్ క్రిస్టోఫ‌ర్ నోల‌న్ తెరకెక్కించిన ఈ సినిమా తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో శృంగార స‌న్నివేశ స‌మ‌యంలో భ‌గ‌వ‌ద్గీత శ్లోకాన్ని వాడ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అటామ్ బాంబు క‌నుగొన్న శాస్త్ర‌వేత్త జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. దీంట్లో న‌టుడు కిలియ‌న్ మ‌ర్ఫీ కీల‌క‌పాత్ర పోషించారు. హీరోయిన్‌తో ఉన్న శృంగార స‌న్నివేశ స‌మ‌యంలో.. హీరో భ‌గ‌వద్గీత శ్లోకాన్ని చెబుతాడు. ఆ సీన్‌పై భిన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

కేంద్ర ప్ర‌భుత్వ స‌మాచార క‌మిష‌న‌ర్ ఉద‌య్ మ‌హూర్క‌ర్ ఆ స‌న్నివేశంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆ సీన్‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. ద‌ర్శ‌కుడు నోల‌న్‌కు లేఖ రాస్తూ.. ఇది హిందూ మ‌తంపై దాడి అని త‌న లేఖ‌లో మ‌హూర్క‌ర్ ఆరోపించారు. ఆ శృంగార సీన్‌లో ఎందుకు గీతా శ్లోకాన్ని వాడారో అర్థం కావ‌డం లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. సీబీఎఫ్‌సీ ఎలా ఆ సీన్‌ను ఓకే చెప్పింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఓపెన్‌హైమ‌ర్‌ను బ్యాన్ చేయాల‌ని ట్విటర్‌లో నెటిజ‌న్లు హోరెత్తిస్తున్నారు. హిందూ మ‌తాన్ని హాలీవుడ్ త‌ప్పుగా చిత్రీక‌రించిందంటూ మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news