ఈస్ట్ సీమలో సాయిరెడ్డి ఎంట్రీ.. సైకిల్‌కి బ్రేక్.!

-

వైసీపీ ఎదుగుదలలో ఎంపీ విజయసాయి రెడ్డి పాత్ర గురించి ఎంత చెప్పిన తక్కువే..ఇప్పుడంటే సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లాంటి వారి హవా ఎక్కువగా ఉంది గాని..ఒకప్పుడు జగన్‌కు అండగా ఉంటూ..పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేశారు. ఎప్పుడైతే విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారో..అప్పటినుంచి విశాఖలో మకాం వేసి..ఉత్తరాంధ్రలో వైసీపీని వన్ సైడ్ గా గెలిపించడమే టార్గెట్ గా పనిచేస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో పార్టీకి అద్భుత విజయం అందించారు.

ఇక పార్టీ అధికారంలోకి వచ్చాక విజయసాయి హవా కొన్నాళ్లు సాగింది. కానీ నిదానంగా ఆయన పార్టీలో వెనుకబడ్డారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర బాధ్యతలు సుబ్బారెడ్డికి ఇచ్చారు. దీంతో సాయిరెడ్డి సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడుప్పుడే ఆయన సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడటం మొదలుపెట్టారు. ఇప్పుడు తూర్పు రాయలసీమ ప్రాంతమైన ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కో ఆర్డినేటర్ బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ పదవికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు.

దీంతో ఈ పదవిని సాయిరెడ్డికి అప్పగించాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే సాయిరెడ్డి..తాజాగా బాలినేనిని కలుసుకుని పార్టీ పరిస్తితులని తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో టి‌డి‌పి జోరు పెరిగింది. ఆ పార్టీ లీడ్ లోకి వస్తుంది. దీంతో సాయిరెడ్డి ఎంట్రీతో టి‌డి‌పికి ఇంకా చుక్కలు కనబడే ఛాన్స్ ఉంది.

సాయిరెడ్డిది ఎలాగో నెల్లూరు జిల్లానే. ఇక ఇక్కడ మకాం వేసి…పార్టీకి మళ్ళీ భారీ ఆధిక్యం తీసుకొచ్చి..వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచేలా పనిచేయనున్నారు. మూడు జిల్లాల్లో మళ్ళీ వైసీపీకి ఆధిక్యం రావడం ఖాయం.

 

Read more RELATED
Recommended to you

Latest news