అరవింద్‌కు కీలక బాధ్యతలు..కారు-కాంగ్రెస్‌కు చెక్ పెడతారా?

-

తెలంగాణలో మళ్ళీ పుంజుకోవాలని బి‌జే‌పి చూస్తుంది. కిషన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతం దిశగా ముందుకెళుతున్నారు. అయితే దూకుడు మీద ఉన్న బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ లకు ధీటుగా ఎదగాలని బి‌జే‌పి ప్రయత్నిస్తుంది. అయితే నేటి రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర చాలా కీలకంగా మారిపోయింది. దాని ద్వారానే సగం రాజకీయం జరిగిపోతుంది. ప్రత్యర్ధులకు చెక్ పెట్టేస్తున్నారు.

రాజకీయాల్లో సోషల్ మీడియా ఒక పార్ట్ అయిపోయింది. దీని ద్వారా ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా క్రియేట్ చేయవచ్చు..రియల్ పాలిటిక్స్ చేయవచ్చు, ఫేక్ పాలిటిక్స్ చేయవచ్చు. ఫైనల్ గా ప్రత్యర్ధిని దెబ్బ తీసి..లబ్ది పొందడమే పార్టీల టార్గెట్ గా మారిపోయింది. ఈ సోషల్ మీడియా వార్ ఏపీలో ఓ రేంజ్ లో నడుస్తుంది. వైసీపీ, టి‌డి‌పిల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. మధ్యలో జనసేన కూడా దూకుడుగా ఉంది. అయితే తెలంగాణలో కూడా ఈ సోషల్ మీడియా వార్ నడుస్తుంది.

ఈ అంశంలో అధికార బి‌ఆర్‌ఎస్ ముందు స్థానంలో ఉంది. అటు కాంగ్రెస్ సైతం సోషల్ మీడియాలో దూకుడు ఉంది. అయితే దేశ స్థాయిలో బి‌జే‌పి సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ అనే విషయం తెలిసిందే. తెలంగాణలో కూడా బి‌జే‌పి సోషల్ మీడియా స్ట్రాంగ్ గా ఉంది. ఇక దాన్ని మరింత స్ట్రాంగ్ చేసేలా బి‌జే‌పి కీలక నిర్ణయం తీసుకుంది. బి‌జే‌పి ఎంపీ ధర్మపురి అరవింద్‌కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు.

సోషల్ మీడియా ద్వారా కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏకిపారేయాలని బీజేపీ నాయకత్వం సన్నద్దమైంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాని ఎక్కువగా వాడుకోవాలని బి‌జే‌పి చూస్తుంది. ఈ క్రమంలో ఎంపీకి సోషల్ మీడియా బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేసీఆర్ సర్కార్ టార్గెట్ గా ఎంపీ అర్వింద్ సోషల్ మీడియా లో దూకుడుగా ఉంటున్నారు. ఇప్పుడు మరింత దూకుడుగా ఉండే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news