అలాంటి జబ్బుతో బాధపడుతున్న భానుప్రియ..!!

అలనాటి అందాల తార భానుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందమైన అమాయకంగా చూసే ఈమె కళ్ళు.. ఈమె అందానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నెమలిలా ఆమె చేసే నాట్యం మన కళ్ళ ముందు ఆడుతుంది..80 ల్లో హీరోయిన్గా ఒక వెలుగు వెలుగును భానుప్రియ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణించారు. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో.. కిందట ఏడాది వరకు కూడా సినిమాలో చేసిన ఈమె ఎక్కువగా అమ్మ పాత్రలు పోషించారు.

ఇకపోతే ఇప్పుడు ఈమె సినిమాలు చేయడానికి ఒప్పుకోలేదు. దీనికి కారణం జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అని భానుప్రియ చెబుతున్నారు. ఈ మేరకు ఆమె తెలుగు యూట్యూబ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి తన ఆరోగ్యం గురించి పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. భానుప్రియ మాట్లాడుతూ.. ఈమధ్య కాలంలో నాకు ఒంట్లో బాగోలేదు.. మెమరీ పవర్ కూడా తగ్గిపోయింది.. నేర్చుకున్న కొన్ని ఐటమ్స్ కూడా మర్చిపోయాను.. డాన్స్ మీద కూడా ఆసక్తి తగ్గింది. ఇంట్లో కూడా నేను డాన్స్ ప్రాక్టీస్ చేయట్లేదు. గత రెండేళ్లుగా మెమొరీ లాస్ తో బాధపడుతున్నాను. ఈమధ్య ఒక సినిమా లొకేషన్లో డైలాగులు కూడా మరిచిపోయాను అంటూ బాధపడింది.

సిల నేరంగిలిల్ సిల మనిధర్గల్ అనే తమిళ సినిమాలో నటించాను. లొకేషన్ కి వెళ్ళగానే డైలాగ్ లన్నీ కూడా మర్చిపోయాను. మళ్లీ నేను సర్దుకున్నాక షూట్ చేశారు అంటూ భానుప్రియ తెలిపారు. ఆరోగ్యం బాగో లేకపోవడం వల్లే మెమొరీ లాస్ అవుతుందని తాను డిప్రెషన్ కి గురి కావడం లేదు అని తెలిపింది భానుప్రియ.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?