పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘ భీమ్లా నాయక్’ ఈరోజు విడుదలైంది. దీంతో ఫ్యాన్స్ హంగామా మొదలైంది. సినిమా కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ రోజు ఉదయం నుంచే ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా నాయక్ ప్రదర్శిస్తున్న థియేటర్ల ముందు సందడి వాతావరణం నెలకొంది. పవన్ ఫ్యాన్స్ కొబ్బరి కాయలు కొడుతూ… నినాదాలు చేస్తూ తెగ హంగామా చేస్తోంది.
ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం థియేటర్లు బంద్ అవుతున్నాయి. ఏపీలోని టికెట్ రేట్లు వల్ల సినిమాను ప్రదర్శించలేమని థియేటర్ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. క్రిష్ణా జిల్లాలో పలు థియేటర్లలో భీమ్లా నాయక్ సినిమా ఆగిపోయింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సినిమాను ప్రదర్శించలేమంటున్నారు. విస్సన్న పేటలో థియేటర్ లో సినిమా వేయాలంటూ పవన్ ఫ్యాన్స్ రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇదే విధంగా మైలవరంలో కూడా తగ్గించిన రేట్లతో సినిమా నడపలేమని థియేటర్లు మూసేశారు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష టీడీపీ… వైసీపీ భీమ్లానాయక్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ.. విమర్శించారు.