మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ పలు ఉద్యోగాలను దరఖాస్తు చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. వివిధ విభాగాల్లోని షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల భర్తీకి అర్హులైన అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇక ఈ జాబ్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…
దీనిలో మొత్తం 155 ఖాళీలు వున్నాయి. షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టులని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తోంది. ఇక ఖాళీల వివరాల లోకి వెళితే.. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ లో 93 ఖాళీలు వున్నాయి. జనరల్ సర్వీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, అబ్జర్వర్, పైలట్, లాజిస్టిక్స్ విభాగంలో పని చేయాలంటే కనీసం 60 శాతం మర్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు కూడా ఉండాలి.
అదే విధంగా ఎడ్యుకేషన్ బ్రాంచ్ లో 17 ఖాళీలు వున్నాయి. ఈ పోస్టులకు అప్లై చెయ్యాలంటే సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మర్కులతో బీఈ/బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దానితో పాటుగా సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు కూడా ఉండాలి. ఇది ఇలా ఉంటే టెక్నికల్ బ్రాంచ్ లో 45 ఖాళీలు వున్నాయి.
ఇంజనీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్), ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) లో పని చెయ్యచ్చు. సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మర్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే.. జనవరి 2, 1998 నుంచి జులై 1, 2003 మధ్య జన్మించి ఉండాలి.
షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ని బట్టి ఎంపిక చేయడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ మార్చి 12, 2022. పూర్తి వివరాలను https://www.joinindiannavy.gov.in/ లో చూసి అప్లై చేసుకోచ్చు.