భూమిక హాట్ పిక్.. సోషల్ మీడియాలో వైరల్..!

-

ఒకప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్.టి.ఆర్ లతో జోడీ కట్టిన భూమిక చావ్లాకు అప్పట్లో క్రేజీ ఫ్యాన్ ఫాలోవర్స్ ఉండేవారు. అయితే అప్పట్లో సోషల్ మీడియా అంత ప్రభావం లేదు కాబట్టి కాని లేదంటే ఆమెకు స్టార్ పట్టం కట్టబెట్టేవారు. ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భూమిక ఎం.సి.ఏ, సవ్యసాచి సినిమాల్లో నటించి మెప్పించింది. లేటెస్ట్ గా ఆమె క్రేజీ ఫోటో షూట్ బయటకు వచ్చింది. సెప్టెంబర్ 2018లో దిగిన ఈ ఫోటో షూట్ ఎందుకో ఏమో తెలియదు కాని ఇందులో భూమిక హాట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

స్టార్స్ తో నటించినా సరే ఎప్పుడు హద్దు దాటని భూమిక చావ్లా ఇప్పుడిలా రెచ్చిపోవడం చూసి అందరు షాక్ అవుతున్నారు. బ్లాక్ అండ్ బ్లాక్ కాస్టూమ్ లో భూమిక హాట్ లుక్ ఇప్పటితరం హీరోయిన్స్ కు ధీటుగా ఉందని చెప్పొచ్చు. మరి భూమిక ఈ క్రేజీ అటెంప్ట్ తను ఇంకా హీరోయిన్ గా చేస్తానని హింట్ ఇచ్చేందుకా అంటూ డిస్కషన్స్ మొదలయ్యాయి. ప్రస్తుతానికి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నా అమ్మడు ఫ్యూచర్ లో ఎలా సర్ ప్రైజ్ చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news