లిఫ్ట్‌లో ఒంటరిగా యువతి.. తన వెనకాలే వెళ్లి.. అత్యంత దారుణంగా.. వైరల్ వీడియో

-

Young girl attacked in Lift in Malaysia

మలేషియాలోని కౌలాలంపూర్ సమీపంలోని చెరస్‌లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. లిఫ్ట్ ఎక్కిన ఓ యువతిని ఫాలో చేసిన ఓ వ్యక్తి.. తన వెనకాలే లిఫ్ట్ ఎక్కి.. లిఫ్ట్ తలుపులు మూసుకోగానే తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆ యువతిపై పిడి గుద్దుల వర్షం కురిపించి.. తన దగ్గర ఉన్న బ్యాగు లాక్కునే ప్రయత్నం చేశాడు. ఓ చోట లిఫ్ట్ ఆగి తలుపులు తెరుచుకోగానే ఏమీ ఎరుగని నంగనాచిలా అలాగే నిలబడి.. మళ్లీ లిఫ్ట్ తలుపులు మూసుకోగానే తనను విపరీతంగా కొట్టి.. తన బ్యాగు లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన ఫిబ్రవరి 14న జరిగింది. అయితే.. ఈ ఘటన లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దాన్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో ట్రెండింగ్‌లో ఉంది.

దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువతి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందింది. బ్యాగులో ఉన్న డబ్బులను, ఏటీఎం కార్డులను ఆ దొంగ ఎత్తుకెళ్లినట్టు ఆమె పోలీసులకు తెలిపింది. ఆ వీడియో ఆధారంగా ఆ యువతిపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకొని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news