అన్ని సినిమాలు ‘బిచ్చగాడు’ కావు

-

సినిమా పరిశ్రమలో మొదట మ్యూజిక్ డైరక్టర్ గా కెరియర్ మొదలు పెట్టి ఆ తర్వాత నటుడిగా మారాడు విజయ్ ఆంటోని. బిచ్చగాడు సినిమాతో తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా ఇక్కడ మోగించిన విజయ భేరి అందరికి తెలిసిందే. తెలుగు సిని పరిశ్రమను షాక్ అయ్యేలా చేసిన డబ్బింగ్ సినిమాల్లో బిచ్చగాడు ఒకటి. ఇక ఆ సినిమా చూశాక విజయ్ ఆంటోని నటించిన ఇదవరకు సినిమాలకు క్రేజ్ వచ్చింది.

అంతేకాదు తను చేసే ప్రతి తమిళ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు విజయ్ ఆంటోని. బిచ్చగాడు తర్వాత బేతాళుడు అదే రకమైన అంచనాలతో వచ్చింది. అయితే ఆ సినిమా నిరాశ పరచింది. అయినా సరే తమిళంలో తాను చేసిన సినిమాలను లైన్ లో రిలీజ్ చేస్తున్నాడు విజయ్ ఆంటోని. ఇలా చేయడం వల్ల తెలుగులో తంకు ఏర్పడిన క్రేజ్ కాస్త తగ్గిపోతుందని గమనించడం లేదు.

రీసెంట్ గా వచ్చిన రోషగాడు కూడా ప్రేక్షకులను నిరాశపరచింది. తెలుగులో ఎప్పుడో వచ్చిన పాత చింతకాయ పచ్చడి కథతో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో విజయ్ వచ్చాడు. కాని సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈమధ్య వచ్చిన కాలి, ఇంద్రసేన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. తెలుగులో బిచ్చగాడి మేజిక్ వర్క్ అవుట్ చేద్దామని అనుకుంటున్న విజయ్ ఆంటోనికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మరి విజయ్ మళ్లీ అలాంటి హిట్ ఎప్పుడు కొడతాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news