ఆర్.ఆర్.ఆర్ టైటిల్ అది కాదా..?

-

రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై ఎనౌన్స్ చేసిననాటి నుండి రోజుకో వార్త హాట్ న్యూస్ అవుతూనే ఉంది. ఈమధ్యనే మొదలైన ఈ సినిమా టైటిల్ గా ఆర్.ఆర్.ఆర్ అదేనండి రామ రావణ రాజ్యం అంటూ హడావిడి చేశారు. ఈ టైటిల్ ను బట్టే కథ అందులో రాముడు చరణ్, రావణుడు తారక్ అని ఫిక్స్ చేశారు. అయితే చిత్రయూనిట్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఆర్.ఆర్.ఆర్ టైటిల్ రామ రావణ రాజ్యం కాదట.

వారు ఓ 10 టైటిల్స్ అనుకోగా అందులో ఒక టైటిల్ రామ రావణ రాజ్యం అట. అది ఫైనల్ చేయలేదని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్, చరణ్ మల్టీస్టారర్ సినిమా రేంజ్ కు తగినట్టుగానే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికలు ఎవరన్నది ఇంకా తెలియలేదు. కీర్తి సురేష్, కియరా అద్వాని, రష్మికల పేర్లు వినిపిస్తున్నాయి. కరణ్ జోహార్ మాత్రం జాన్విని ఈ ప్రాజెక్ట్ లో భాగం చేయాలని చూస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news