పాన్ మసాల కంపెనీకి షాక్ ఇచ్చిన బిగ్ బి

ప్ర‌ముఖ పాన్ మసాల సంస్థ క‌మ‌ల పసంద్ కంపెనీ కి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చన్ షాక్ ఇచ్చాడు. త‌మ మ‌ధ్య కాంట్రాక్ట్ ర‌ద్దు అయిన‌ప్పటికీ పాన్ మసాలా యాడ్ లు ప్ర‌సారం అవుతున్నాయ‌ని బిగ్ బి క‌మ‌ల పసంద్ కంపెనీ కి లీగల్ నోటీస్ లు పంపించాడు. త‌న కాంట్రాక్ట్ ను ర‌ద్దు చేసుకున్న ప్ర‌క‌ట‌న ల‌ను ప్రసారం చేయ‌డం పై బిగ్ బీ అగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఇలా చేయ‌డం పై పాన్ మసాల కంపెనీ పై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసు కోవ‌డానికి సిద్ధం అవుతున్నాడు.

కాగ పోగాకు నిషేధం లో భాగంగా ఇలాంటి ప్ర‌క‌ట‌న ల కు దూరంగా ఉండాల‌ని జాతీయ పొగాకు వ్య‌తిరేక సంస్థ అమితాబ్ బ‌చ్చ‌న్ ను కొరింది. అలాగే ప‌లు సోష‌ల్ మీడియా ల‌లో కూడా బిగ్ బీ పై చాలా వ్య‌తిరేక‌త వ‌చ్చింది. అమితాబ్ బ‌చ్చ‌న్ వెంట‌నే త పాన్ మ‌సాల సంస్థ నుంచి త‌ప్పు కోవాల‌ని ప‌లువురు ప్రచారం చేశారు. అంతే కాకుండా ఒక దిన పత్రిక కూడా బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ పై విమ‌ర్శలు గుప్పిస్తు వార్త‌లు కూడా రాసింది. దీంతో చివ‌రికి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ పాన్ మ‌సాల కంపెనీ తో ఉన్న కాంట్రాక్ట్ ను ర‌ద్దు చేసుకున్నాడు. అయిన క‌మ‌ల ప‌సంద్ బిగ్ బీ చేసుకున్న యాడ్ ల‌ను ప్ర‌సారం చేయ‌డం పై లీగ‌ల్ నోటీసులు ఇచ్చాడు.