బిగ్ బాస్ 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీ పూజా రామచంద్రన్.. సినిమాలతో తెచ్చుకోలేని క్రేజ్ బిగ్ బాస్ తో తెచ్చుకుంది. మెయిన్ హీరోయిన్ గా కాకున్నా సపోర్టింగ్ రోల్స్ తో ఆకట్టుకుంటున్న పూజా రామచంద్రన్ తన రెండో పెళ్లితో అందరిని సర్ ప్రైజ్ చేసింది. కొన్నాళ్లుగా రిలేషన్ షిప్ లో ఉంటున్న నటుడు జాన్ కొక్కెన్ తో పూజా పెళ్లి జరిగింది. కేరళ సాంప్రదాయంలో వీరు పెళ్లి చేసుకున్నారు.
ఎస్.ఎస్ మ్యూజిక్ యాంకర్ గా విజేగా కెరియర్ స్టార్ట్ చేసిన పూజా రామచంద్రన్ అతన్నితో ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే రెండేళ్లకే వారి పెళ్లి పెటాకులైంది. ఆ తర్వాత సోలోగా ఉంటూ వస్తున్న పూజా జాన్ కొక్కెన్ తో స్నేహం చేసింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకొచ్చింది. విశేషం ఏంటంటే జాన్ కొక్కెన్ కు ఇది రెండో పెళ్లే. జాన్ కొక్కెన్ మీనా వాసుదేవన్ ను పెళ్లాడాడు అయితే వీరికి మనస్పర్ధలు రావడం వల్ల విడాకులు తీసుకున్నారు. తన పెళ్లి ఫోటోలతో పూజా సర్ ప్రైజ్ చేసింది. బిగ్ బాస్ 2 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన పూజా రామచంద్రన్ ఉన్నది కొద్దివారాలే కాని ఆమె సత్తా చాటింది.