కౌశల్ ఎలిమినేషన్ కు బిగ్ బాస్ భారీ స్కెచ్

-

బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్ లో కౌశల్ స్టాంగ్ కంటెస్టంట్ కాగా మిగతా ఇంటి సభ్యులంతా అతంకి యాంటీగా ఉన్నారు. ఇక్కడకు వచ్చింది గేం ఆడేందుకే రిలేషన్ పెట్టుకునేందుకు కాదు అనేలా మొదటి నుండి తన వైఖరిని చూపిస్తున్న కౌశల్ ఫైనల్ రేసులో ఉన్నాడని చెప్పొచ్చు. ఇక అతను చేసే పనుల వల్ల అతనికి బయట ఫాలోవర్స్ పెరిగిపోయారు. కౌశల్ ఆర్మీ అంటూ ఓ సెపరేట్ గ్యాంగ్ ఏర్పడింది.

ఈమధ్యనే వారంతా కలిసి 2కే వాక్ కూడా చేశారు. కౌశల్ కు కాకుండా బిగ్ బాస్ టైటిల్ మరెవరికైనా వస్తే బాగోదని అన్నట్టుగా కౌశల్ ఆర్మీ బిగ్ బాస్ నిర్వాహకుల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో కౌశల్ ఆర్మీ కౌశల్ ను దూరం చేసుకునేలా మెగా ప్లాన్ వేస్తున్నారట. ఫైనల్స్ కు దగ్గర పడుతున్న బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ ఆంక్షల ప్రకారం కింగ్ ఆఫ్ హౌజ్ గా ఒకరిని ప్రకటిస్తారట.

ఆ గేం లో భాగంగా ఆ కింగ్ ఏం చెబితే అలా చేయాలి లేదంటే వారికి శిక్ష పడుతుంది. ఆల్రెడీ హింది, తమిళ్, కన్నడ భాషల్లో బిగ్ బాస్ లో ఈ గేం ఆడారు. అలానే కింగ్ ఆఫ్ హౌజ్ గా కౌశల్ ను పెట్టించి హౌజ్ మెట్స్ ను మరింత ఇబ్బంది పెట్టేలా ప్లాన్ చేస్తున్నాడట. దాని వల్ల కౌశల్ మీద మరింత నెగటివ్ ఇంప్రెషన్ వచ్చేలా చేయాలని బిగ్ బాస్ నిర్వాహకుల ప్లాన్ అని తెలుస్తుంది.

ప్రస్తుతం 7 మంది హౌజ్ మెట్స్ ఉన్న బిగ్ బాస్ హౌజ్ లో టైటిల్ విన్నర్ ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.. కౌశల్ ఆర్మీ మాత్రం కౌశల్ కే టైటిల్ ఇచ్చేయాలని పట్టుబడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news