కరెక్ట్ టైంలో కరెక్ట్ సాంగ్.. దేవదాస్ అదుర్స్

-

నాగార్జున, నాని చేస్తున్న మల్టీస్టారర్ మూవీ దేవదాస్. యువ దర్శకుడు శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. క్రేజీ మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్, రష్మిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మూడవ సాంగ్ గా గణేష్ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

కరెక్ట్ టైంలో కరెక్ట్ సాంగ్.. లక లక లకుముకిరా అంటూ గణపతి సాంగ్ రిలీజ్ చేశారు. సాంగ్ లో నాగార్జున, నానిలు అదరగొట్టేశారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ఈ సాంగ్ ను రామజోగయ్య శాస్త్రి రచించారు. వినాయక చవితి సందర్భంగా వచ్చిన ఈ సాంగ్ సినిమాపై క్రేజ్ తీసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news