‘బిగ్​బాస్ సీజన్ 6’ ప్రోమో వచ్చేసింది..

తెలుగు టీవీ ఆడియోన్స్‌ను అలరించేందుకు బిగ్‌బాస్ మళ్లీ వస్తున్నాడు. “బిగ్​బాస్ సీజన్ 6.. ఎంటర్​టైన్​మెంట్​కి అడ్డా ఫిక్స్” అనే స్లోగన్​తో రిలీజ్​ అయిన బిగ్​బాస్ సీజన్ 6 ప్రోమో అదిరిపోయింది. ప్రతి ఏడాదిలోనే ఈసారి కూడా బిగ్‌బాస్ సీజన్ మరింత అలరించనుంది. బిగ్‌బాస్ సీజన్ 6 మొదలు కాబోతోంది. అతిత్వరలోనే ఈ షో ప్రారంభం కానుంది. బిగ్ బాస్ 6లో పాల్గొనే కంటెస్టెంట్ల లిస్టు కూడా తయారైంది.

గత మూడు సీజన్ల నుంచి బిగ్ బాస్ హోస్టుగా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ఈసారి కూడా బిగ్ బాస్ 6 సీజన్ హోస్టుగా నాగార్జున వ్యవహరిస్తున్నాడు. లేటెస్టుగా రిలీజ్ అయిన ప్రోమోలో నాగార్జున ఎంట్రీ సీన్ అదిరింది. కూతురికి పెళ్లి చేసి అప్పగింతలు చేస్తూ ఏడుస్తున్న తల్లిదండ్రులు బిగ్​బాస్ షో టైం అవ్వగానే అక్కణ్నుంచి మాయమైపోవడంతో ఈ ప్రోమో మొదలైంది.

‘హలో డియర్’ అంటూ నాగార్జున ఎంట్రీ ఇస్తూ.. పెళ్లి కూతురితో ‘అప్పగింతల వరకు కూడా ఆగలేకపోయారంటే.. అక్కడ ఆట(బిగ్​బాస్) మొదలైనట్టే’ అని అంటారు. ‘లైఫ్​లో ఏ మూమెంట్ అయినా బిగ్​బాస్ తర్వాతే’.. అంటూ నాగ్ చెప్పే డైలాగ్ బిగ్​బాస్​కి ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారో చెప్పకనే చెప్పేస్తోంది. ఇక త్వరలోనే బిగ్​బాస్ సీజన్ 6 మీ ముందుకు వస్తుంది. అప్పటిదాకా మీరు ఈ ప్రోమో చూస్తూ ఎంజాయ్ చేయండి..