కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్న సాఫిత్రి అక్క, మణికొండ సాఫిత్రి అవుతుందిగా…!

-

వీ6 న్యూస్ లో ప్రసారం అయ్యే తీన్మార్ వార్తలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అందులో వచ్చే బిత్తిరి సత్తి, సాఫిత్రి అక్కకు ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బిత్తిరి సత్తి ఎంత పాపులర్ అయ్యాడో… సాఫిత్రి అక్క కూడా అదే రేంజ్ లో పాపులర్ అయింది. అసలు ఆమె పేరు సాఫిత్రి కాదు. ఆమె పేరు శివజ్యోతి. బిగ్ బాస్ 3 ద్వారా ఆమె పాపులర్ అయింది. ఆ షో తో ఆమె గురించి అందరూ తెలుసుకునే ప్రయత్నం చేసారు.

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఉన్న బాల్కొండ మండలంలోని నాగంపేట గ్రామం. ఆమె తల్లిదండ్రుల పేర్లు రాజమల్లేశ్, యశోద. ఆమె తల్లి బీడీ కార్మికురాలు కాగా.. తండ్రి ఆర్ఎంపీ డాక్టర్. వాళ్లది మధ్య తరగతి కుటుంబం. శివజ్యోతి నాగంపేటలో ఏడో తరగతి వరకు చదివింది. 8 నుంచి 10 వరకు రేంజర్ల అనే గ్రామంలో చదివింది. ఇంటర్ నిజామాబాద్ లో చదివింది. తర్వాత హైదరాబాద్ లో యశోద ఆసుపత్రిలో బీఎస్సీ నర్సింగ్ కోర్స్ లో చేరింది.

కానీ.. నర్సింగ్ కోర్సును మధ్యలోనే వదిలేసి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసింది. కాని యాంకర్ కావాలి అనే కోరిక ఉండటంతో ఆమె అవకాశం దక్కించుకుని ఆకట్టుకుంది. ఇక ఆ షో లో అచ్చ తెలుగు అమ్మాయిగా ఆమె అలరించింది. బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ ఎంత అయిందో తెలియదు గాని తీన్మార్ వార్తలు ఆమెకు మంచి క్రేజ్ తెచ్చి పెట్టాయి అనేది వాస్తవం. ఇప్పుడు ఆమె టీవీ9 లో పని చేస్తుంది.

ఇది పక్కన పెడితే సాఫిత్రి అక్క… అదే శివ జ్యోతి ఇప్పుడు హైదరాబాద్ లోని మణికొండలో ఫ్లాట్‌ కొనుక్కుంది. కాస్ట్లీ ఏరియా గా పేరున్న ఆ ప్రాంతంలో ఆమె ఈ ఫ్లాట్‌తో సెటిల్ అయింది. ఇప్పటికే పెళ్లి చేసుకున్న ఆమె సొంత ఇంట్లో అడుగుపెట్టనుంది. దీనితో పలువురు ఆమెను అభినందిస్తున్నారు. అంచెలంచెలుగా ఎదిగి… తన కోరిక నెరవేర్చుకుని జీవితంలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ శివజ్యోతి ఖరీదైన ప్రాంతంలో ఇల్లు కొనుక్కోవడంతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరిన్ని విజయాలు సాధించి జీవితంలో మరింతగా వృద్ది సాధించాలని మనలోకం కూడా ఆకాంక్షిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news