సైరాలో మెగా డాటర్..!

Big Chance for Mega Heroine

మెగా డాటర్ నిహారిక తొలి ప్రయత్నం ఒక మనసు నిరాశపరచగా రెండేళ్లు గ్యాప్ తీసుకుని హ్యాపీ వెడ్డింగ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. లక్ష్మణ కార్య డైరక్షన్ లో వస్తున్న హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరోగా చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొన్న నిహారిక మెగాస్టార్ 151వ మూవీ సైరా నరసింహారెడ్డి మూవీలో తాను నటిస్తున్న విషయాన్ని వెళ్లడించారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న సైరా సినిమాలో నిహారిక ఓ గిరిజన మహిళగా కనిపిస్తుందట. ఈ ఛాన్స్ కోసం చరణ్ అన్న కాళ్లు పట్టుకున్నా అని చెప్పింది నిహారిక. మెగా హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకత కోసం ఎదురుచూస్తున్న నిహారిక సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లతో కూడా ఆడియెన్స్ కు దగ్గరవుతుంది. శనివారం రిలీజ్ అవుతున్న హ్యాపీ వెడ్డింగ్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది నిహారిక. ఈ సినిమా ఫలితం కచ్చితంగా ఆమెను ఆనందపరచేలా ఉండాలని ఆశిద్దాం.