వరుణ్ తేజ్ మరో క్రేజీ అటెంప్ట్..!

varun tej crazy project nenu local director

మెగా హీరోగా ఎంట్రీ ఇస్తే మెగా ఫ్యాన్స్ అండదండలు ఉంటాయి. అయితే కామన్ హీరో కన్నా మెగా హీరోలకు కొన్ని టఫ్ టాస్కులు ఉంటాయి. అవేంటో కాదు ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడమే. అది తెలియక ముందు రెండు హిట్లు కొట్టి ఇప్పుడు వరుస ఫ్లాపులు ఎదుర్కుంటున్నాడు సాయి ధరం తేజ్. ఇక అదేంటో ముందు కనిపెట్టని వరుణ్ తేజ్ వరుస హిట్లతో మంచి ఫాంలో ఉన్నాడు.

మెగా బ్రదర్ నాగబాబు తనయుడిగా వరుణ్ తేజ్ ముకుందతో ఎంట్రీ ఇవ్వగా ఫిదాతో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. కంచె కూడా పర్వాలేదు అనిపించినా ఫిదా మాత్రం అందరిని ఫిదా అయ్యేలా చేసింది. ఇక ఆ వెంటనే తొలిప్రేమతో కూడా హిట్ కొట్టాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం ఘాజి డైరక్టర్ సంకల్ప్ రెడ్డితో అంతరిక్షం సినిమా చేస్తున్న వరుణ్ తేజ్ ఆ సినిమాతో పాటుగా అనీల్ రావిపుడి డైరక్షన్ లో వెంకటేష్ తో కలిసి ఎఫ్-2లో కూడా నటిస్తున్నాడు.

ఇవే కాకుండా సినిమా చూపిస్త మావ, నేను లోకల్ సినిమాల దర్శకుడు నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో వరుణ్ తేజ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. సినిమా సినిమాకు తన ఫార్ములా మార్చేస్తున్న వరుణ్ తేజ్ ఇలానే సూపర్ ఫాం కొనసాగించేలా ఉన్నాడు. త్రినాథరావు ప్రస్తుతం రామ్ తో సినిమా చేస్తున్నాడు. అది పూర్తయ్యాక వరుణ్ తేజ్ తో చేస్తాడని టాక్.