అరవింద సమేత ఐదురోజుల లెక్క ఇది..!

-

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమా నందమూరి అభిమానులకు ముందే పండుగ వచ్చేలా చేసింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. మొదటి రోజే 30 కోట్ల షేర్ రాబట్టిన అరవింద సమేత సినిమా వీకెండ్ కల్లా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఇక ఈ సినిమా 5 రోజుల కలక్షన్స్ విషయానికి వస్తే అక్షరాల 52.65 కోట్లు అది కూడా కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లో వచ్చిన మొత్తం ఇది. ఓవర్సీస్ లో 1 మిలియన్ క్రాస్ అయ్యి 2 మిలియన్ కలక్షన్స్ కు దూసుకెళ్తుంది. ఎన్.టి.ఆర్ సరసన పూజా హెగ్దె నటించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానార్ లో ఎస్ రాధాకృష్ణ నిర్మించారు.

ఏరియాల వారిగా అరవింద సమేత 5 రోజుల కలక్షన్స్ :

నైజాం – 15.00 కోట్లు

సీడెడ్ – 11.81 కోట్లు

ఉత్తరాంధ్ర – 5.93 కోట్లు

ఈస్ట్ – 4.29 కోట్లు

వెస్ట్ – 3.52 కోట్లు

కృష్ణ – 3.77 కోట్లు

గుంటూరు – 6.37 కోట్లు

నెల్లూరు – 1.96 కోట్లు

ఏపి. తెలంగాణా : 52.65 కోట్లు షేర్ రాబట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news