నోటాతో సత్తా చాటాలని..!

-

విజయ్ దేవరకొండ హీరోగా తమిళ దర్శకుడు ఆనంద్ రంగ డైరక్షన్ లో వస్తున్న సినిమా నోటా. స్టూడియో గ్రీన్ బ్యానర్ లో జ్ఞానవెల్ రాజా నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులో ప్రమోషన్స్ మొదలు పెట్టిన నోటా యూనిట్ తెలుగులో కూడా భారీ వేదికలను ఏర్పాటు చేస్తున్నారట.

రెండు తెలుగు రాష్ట్రాలను కవర్ చేసేలా విజయవాడ.. హైదరాబాద్ లో రెండు ఈవెంట్లను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. యూత్ తో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న విజయ్ నోటాతో మరోసారి సత్తా చాటాలని చూస్తున్నాడు. సినిమాలో విజయ్ సిఎం పాత్రలో కనిపించనున్నాడు. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విజయ్ సక్సెస్ మేనియా కొనసాగించేలా చేస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news