RRR Update : రేపు ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ అప్‌డేట్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా నుంచి రేపు బిగ్ అప్ డేట్ రానుంది. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి జ‌న‌ని అనే పాట ను రేపు సాయంత్రం 4 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ పాట‌ను తెలుగు తో పాటు హింది, త‌మిళ్, క‌న్న‌డా వంటి మొత్తం 5 భాషా ల‌లో విడుద‌ల చేయ‌న్నారు.

దీంతో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ అభిమానులు జ‌న‌ని పాట కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పాట కు ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం. ఎం కీర‌వాణీ సంగీతాన్ని అందించాడు. కాగ ఈ సినిమా ను మూడు సంవ‌త్సరాల క్రితం ప్రారంభించారు. దీంతో అప్ప‌టి నుంచి అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీంతో వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7 న విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. అయితే ఈ సినిమా లో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ తో పాటు అలియా భ‌ట్, అజ‌య్ దేవ‌గ‌న్, స‌ముద్ర క‌ని, శ్రీ‌యా శ‌ర‌ణ్ న‌టిస్తున్నారు.