బిగ్‌బాస్‌లో ఏంది ఈ లొల్లి…. చూసే వాళ్ల‌కు త‌లనొప్పే

-

ఎవరు అవునన్నా… ఎవరు కాదన్నా తెలుగు బుల్లితెర పాపులర్ షో బిగ్‌బాస్ సీజన్ 3 తొలి రెండు సీజ‌న్ల‌తో పోలిస్తే ఆశించినంతగా ఆకట్టుకోలేకపోతోంది. తొలి రెండు సీజ‌న్ల‌కు మంచి టీఆర్పి రేటింగులు వచ్చాయి.ఎందుకోగానీ బిగ్ బాస్ మూడో సీజన్ తొలినుంచి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆపసోపాలు పడుతూ అష్టకష్టాలు పడుతూ వస్తోంది. ప్రేక్షకుల నుంచి బిగ్ బాస్ ఎపిసోడ్ లకు ఏ మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ లేదు. అసలే షో నీరసంగా ఉందన్న విమర్శలు వస్తుంటే దానికి తోడు బిగ్‌బాస్ ఒక్కోసారి ప‌స‌లేని టాస్క్ ఇస్తూ షోను మరింత నీరు కార్చేస్తున్నాడు.

ఇక హౌస్‌లో ఉన్న బిగ్‌బాస్ హోట‌ల్ విష‌యానికి వ‌స్తే బిగ్‌బాస్‌ హోటల్‌ ఒకప్పుడు బాగానే వుండేది.. అదిప్పుడు వైభవం కోల్పోయింది. దానికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాల‌ట‌. ఈ హోటల్‌కి వరుణ్‌ సందేశ్‌ మేనేజర్‌. వంట విభాగంలో బాబా భాస్కర్‌, శ్రీముఖి, వితికా షెరులను బిగ్‌బాస్‌ నియమించాడు. క్లీనింగ్‌ బాధ్యత అలీ రెజా, శివ జ్యోతి, రాహుల్‌ సిప్లిగంజ్‌లది. ఈ టాస్క్‌ పేరుతో రష్‌ అవర్‌, స్లీప్‌ మోడ్‌, ఫ్రీజ్‌.. ఇలా కొన్ని ‘డ్రిల్స్‌’ కూడా పొందుపర్చాడు.

ఇక టాస్క్ జ‌రుగుతున్న‌ప్పుడు కంటెస్టెంట్ల‌కు సంబంధించిన ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఎవ‌రో ఒక‌రు హౌస్‌లోకి వ‌స్తుంటారు. ముందుగా వితిక చెల్లి రితిఖ ఎంట్రీ ఇచ్చింది. ఆమె హౌస్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు వితిక డ్రిల్ చేస్తోంది. చెల్లిని చూసి ఆమె చాలా ఎమోష‌న‌ల్‌గా ఫీల్ అయ్యింది. బిగ్‌బాస్ రెండో సీజ‌న్లోనూ ఈ ఎపిసోడ్ ఉంది. అయితే ఆ సీజ‌న్లో ఉన్న ఎమోష‌న్ చాలా స్ట్రాంగ్‌.. కానీ ఈ సీజ‌న్లో ఎమోష‌న్ పూర్తిగా తేలిపోయింది.

ఇక రితిక బిగ్‌బాస్ హోట‌ల్‌కు రేటింగ్ కూడా ఇచ్చింది. ఇక ఆమె వెళ్లాక ఆలీ భార్య మౌస‌మి వ‌చ్చింది. ఏదేమైనా ఈ ప‌స‌లేని టాస్క్‌ను చూసి ప్రేక్ష‌కులు పిచ్చ బోర్ ఫీల‌వుతున్నార‌న్న విమ‌ర్శ‌లు ఎక్కువుగా వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version