Bigboss7:సమంత గురించి అడిగి విజయ్ ను ఇరుకున పెట్టిన నాగార్జున..!

-

తెలుగులో ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు సాయంత్రం స్టార్ మా లో 7:00కి ప్రసారం కానుంది. ఇప్పటికే ఎన్నో కథనాలు వెలువడినప్పటికీ కూడా తాజాగా షో నుంచి ఒక చిన్న ప్రోమో అని వదలడం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తుండగా.. విజయ్ దేవరకొండ నవీన్ పోలిశెట్టి ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు ఇందులో భాగంగానే తన మాజీ కోడలు సమంతా గురించి అడిగి విజయం ఇరుకున పెట్టేశారు నాగార్జున.

ఇక ప్రోమోలో ఏముంది అనే విషయానికి వస్తే.. ఈసారి హౌస్ లో ఉండాలి అంటే అంత ఈజీ కాదు అని నాగార్జున చెప్పే డైలాగ్ తో ప్రోమో మొదలవుతుంది. కంటెస్టెంట్లతో నాగార్జున మాట్లాడినప్పటికీ కూడా వారు ఎవరో రివీల్ చేయలేదు. ఇక విజయ్ దేవరకొండ అతిథిగా రాగా ఆరాధ్య పాటతో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత నాగార్జున మీ హీరోయిన్ సమంత ఎక్కడ అంటూ నాగార్జున ప్రశ్నించగా విజయ్ దేవరకొండ మాత్రం చిరునవ్వుతో సమాధానం చెప్పకుండా దాటివేసినట్లు మనకు కనిపిస్తుంది. ఇక ఈ విషయంపై ఈ ప్రోమో కాస్త మరింత వైరల్ గా మారిందని చెప్పవచ్చు. ఇకపోతే ఆ తర్వాత హీరో నవీన్ పోలిశెట్టి కూడా వచ్చి తనదైన శైలిలో ప్రేక్షకులను నవ్వించారు.

ఇకపోతే ఈ సీజన్ మిగతా సీజన్లలో ఉండదని ఉల్టా పల్టాగా ఉంటుందని ఇక ప్రతిసారి టాప్ ఫైవ్ లో ఉన్న కంటెస్టెంట్లకు మాత్రమే ప్రైజ్ మనీ సూట్ కేసును ఆఫర్ చేస్తుంటాము. కాకపోతే ఈసారి మొత్తం మొదటి ఐదుగురు కంటెస్టెంట్లు ఇంట్లోకి అడుగుపెట్టగానే.. ఒక సూట్ కేస్ ఆఫర్ చేశారు. అందులో ఉన్న నగదును తీసుకొని ఎవరైనా ఇప్పుడే వెళ్లిపోవచ్చు అని కూడా నాగార్జున చెప్పారు. మొత్తానికైతే ఈసారి సీజన్ మాత్రం బోలెడు ట్విస్ట్ లతో ఉండే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news