సవ్యసాచి టీజర్.. కాన్సెప్ట్ అదిరిందిగా..!

-

శైలజా రెడ్డి అల్లుడు తర్వాత అక్కినేని నాగ చైతన్య చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న సినిమా సవ్యసాచి. ఇద్దరు ప్రేమం రీమేక్ చేసి హిట్ కొట్టగా ఈసారి కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా చేస్తున్నారు. కార్తికేయతో సత్తా చాటిన చందు మొండేటి ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో సవ్యసాచి సినిమా చేశాడు. కొద్ది గంటల క్రితం రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఒకతల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములు అంటారు.. అదే ఒక రక్తం ఒకే శరీరం పంచుకుని పుడితే అది అద్భుతం అవుతుంది.. వరుసకి కనిపించని అన్నను.. సవ్యసాచిలో సగాన్ని కవచాన్ని అంటూ నాగ చైతన్య చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. సవ్యసాచి టైటిల్ కు తగ్గ కథతోనే సినిమా వస్తుందని తెలుస్తుంది. శైలజా రెడ్డి అల్లుడు అంచనాలను అందుకోలేదు కాబట్టి ఈ సవ్యసాచి అయినా చైతు కెరియర్ లో సూపర్ హిట్ కొడుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version