బిగ్‌బాస్ 3 నుంచి నాగ్ అవుట్… కొత్త హోస్ట్ ఎవ‌రంటే..?

-

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోకి కింగ్ నాగార్జున హోస్ట్‌గా నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న ఈ రియాలిటీ షోకి బుల్లితెర ప్రేక్షకుల నుండే కాకుండా సినీ ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పోన్స్ వ‌స్తోంది. ప్ర‌స్తుతం నాగార్జున‌ ఈ షోను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నాడ‌నే చెప్పాలి. నాగార్జున ఇంత‌కు ముందు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. అలాగే ఇప్పుడు కూడా బాగ్‌బాస్ షోలో హోస్ట్‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నాడు.

Bigg Boss 3 Telugu Show Host Nagarjuna Replacing by Nani or Ramya Krishna

ఇక‌ తాజా స‌మాచారం ప్ర‌కారం నాగ్ బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా త‌ప్పుకున్నాడు. మ‌రియు కొత్త హోస్ట్ ఎంట్రీ కూడా ఖ‌రారు అయింద‌ట‌. అయితే అస‌లు విష‌యం ఏంటంటే.. నాగార్జున‌ పూర్తిగా బిగ్‌బాస్ నుంచి త‌ప్పుకోవ‌డం లేదు. నాగ్  60వ పుట్టిన సంద‌ర్భంగా ఫ్యాన్‌కు అందుబాటులో లేకుండా మ‌రియు ఇండస్ట్రీ వర్గాల వారికి కూడా దూరంగా నాగార్జున ఫ్యామిలీతో బర్త్ డేను అద‌ర్ కంట్రీలో జరుపుకున్నాడు. ఈ క్ర‌మంలోనే నాగార్జున బిగ్‌బాస్ హోస్ట్‌గా ఈ వీక్ రావ‌డం లేదు.

అయితే ఈ ఒక్క వీక్ కోసం బిగ్ బాస్ నిర్వాహ‌కులు సీజ‌న్ 2 హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన నేచుర‌ల్ స్టార్ నానిని గానీ లేదా సీనియ‌ర్ హీరోయిన్ రామ్య‌కృష్ణ‌ను గాని హోస్ట్‌గా చేయించాల‌ని ఖ‌రారు చేశార‌ట‌. మ‌రి వీరిద్ద‌రిలో ఈ వీకెండ్‌కి హోస్ట్‌గా ఎవ‌రు వ‌స్తారో మాత్రం క్లారిటీ లేదు. అయితే ఈ వీక్ త‌ర్వాత మామూలుగానే నాగార్జున‌ రీబ్యాక్ అవుతాడు. ఇక‌ ఈ వీక్ బిగ్‌బాస్ హోస్ట్‌గా ఎవ‌రు వ‌స్తారో ఈ వీకెండ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version