గాయంతో బాధపడుతున్నా బిగ్ బాస్ విజేతగా నా కొడుకే గెలుస్తాడు..

-

బిగ్ బాస్ రియాలిటీ షో ఈ వారం రసవత్తరంగా సాగుతుంది. నామినేషన్లలో ట్విస్టులు ప్రేక్షకులకి ఆసక్తి కలిగించాయి. అదే క్రమంలో నాటకీయత విపరీతంగా పెరగడంతో కొందరు నిరాశకి గురయ్యారు. బిగ్ బాస్ షోలో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లు అందరూ స్ట్రాంగ్ గానే కనిపిస్తున్నారు. ఒక్క అమ్మ రాజశేఖర్ మినహాయిస్తే మిగతా అందరూ ఫర్వాలేదనిపిస్తున్నారు. తాజాగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులని పలకరించిన కొన్ని మీడియా ఛానెల్స్ కి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

అభిజిత్ అమ్మగారు మాట్లాడుతూ, నా కొడుకు భుజానికి కొన్ని రోజుల క్రితం గాయమైంది. అందువల్లే ఫిజికల్ టాస్కుల్లో పెద్దగా ఆడట్లేదు. ఇంట్లో కూడా అభిజిత్ సైలెంట్ గా ఉంటాడు. భుజం నొప్పితో బాధపడుతున్నప్పటికీ బిగ్ బాస్ విజేతగా నా కొడుకే గెలుస్తాడన్న నమ్మకం ఉందని, బయట కూడా అభిజిత్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడిందని, అందువల విజేతగా గెలుస్తాడని నమ్మకంగా ఉందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news