బిగ్‌బాస్ 4 : స్క్రిప్ట్‌లేకుండా బిగ్‌బాస్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా!

-

బిగ్‌బాస్ రోజులు గ‌డుస్తున్నా కొద్దీ ఇరిటేష‌న్ తెప్పిస్తోంది. త‌ల‌తిక్క టాస్కుల‌తో షో గ‌తి త‌ప్పుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. 47వ రోజు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ చూస్తే ఏం చేయాలో తెలియ‌క ఈ టాస్క్ ఇచ్చిన‌ట్టుగా ఇట్టే తెలిసిపోతోంది. శుక్ర‌వారం `బిగ్‌బాస్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా` పురుతో ఇంటి స‌భ్యుల‌కు ఇచ్చిన టాస్క్ చిరాకు పుట్టించింది. ఇంటి స‌భ్యుల‌తో పాటు చూసే వీవ‌ర్స్ స‌హ‌నాన్ని ప‌రీక్షించింద‌ని చెప్పొచ్చు.

సెంచ‌రీ మ్యాట్రిసెస్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఈ టాస్క్‌ని బిగ్‌బాస్ ఇచ్చాడు. అభి డైరెక్ట‌ర్‌, అవినాష్ స్క్రిప్ట్ అండ్ ఆర్టిస్ట్‌, అరియానా అత‌నికి జోడీ. ఇక విల‌న్ గా మోహ‌బూబ్‌, డీఓపీగా నోయెల్‌, అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా దివి, కొరియోగ్రాఫ‌ర్‌గా అమ్మ‌రాజ‌శేఖ‌ర్ క‌నిపించారు. ఐట‌మ్ సాంగ్ డ్యాన్స‌ర్స్‌గా ‌హారిక అండ్ సోహైల్‌. ఇక ఈ సినిమాలో హీరోగా అఖిల్‌, హీరోయిన్‌లుగా మోనాల్‌, అరియానా న‌టించాలి.

ఇక స్టోరీ డిస్క‌ర్స‌న్ టైమ్‌లో అమ్మాకు, అభికి వాగ్వివాదం, ఆ త‌రువాత డైలాగ్‌ల విష‌యంలో అవినాష్‌, అభిల మ‌ధ్య గొడ‌వ‌.. సీన్‌ల మ‌ధ్య‌లో అఖిల్‌.. మోహ‌బూబ్‌ల మ‌ధ్య ఫైట్‌.. అఖిల్‌, మోనాల్ ల‌వ్‌స్టోరీ ర‌చ్చ వెర‌సి శుక్ర‌వారం ఎపిసోడ్ చెప్పాలంటే ర‌చ్చ ర‌చ్చ‌గా మారింది. ఒక్క ఇంట్రెస్టింగ్ పాయింట్ లేదు. మ‌రీ ఇంత పేల‌వంగా ఎపిసోడ్‌ని ఎలా ప్లాన్ చేశారో అర్థం కాని ప‌రిస్థితి. మొత్తానికి 47వ రోజు లోకి ఎంట‌రైన బిగ్‌బాస్ సీజ‌న్ 4 గ‌త త‌ప్పుతున్న‌ట్టుగా క‌నిపించింది. పెట్ట‌డానికి టాస్కులు కొత్త‌గా ఏమీ లేక‌పోవ‌డంతో పేప‌ర్ పై లేని క‌థ‌ని సినిమాగా చేసే టాస్క్ ఇచ్చి బిగ్‌బాస్ ని నీరు గారుస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ య‌మ బోరింగ్‌గా నీర‌సంగా పేల‌వంగా సాగి వీవ‌ర్స్‌ని నిరుత్సాహానికి గురిచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news