ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్

-

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. సరిగ్గా దసరాకు ముందు ఈ శుభవార్త అందించడంతో ఉద్యోగస్తులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ శుభ వార్త ఏంటంటే ఉద్యోగస్తులు అందరికీ 5.25 శాతం మేర డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదుహ్ 2019 జూలై నుంచి రావాల్సిన ఒక డీఏను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 33.53 శాతం ఉన్న డీఏని 38.77 శాతానికి పెంచారు.

ఉద్యోగులకు చెల్లించాల్సిన మూడు డీఏల్లో రెండింటిపై కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉందని కేసీఆర్ అన్నారు. అలానే 2020-21 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్. కరోనా కారణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో భారీగా కోత పడిందన్న ఆయన లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా భారీగా తగ్గిపోయిందన్నారు. కేంద్ర జిడిపి మైనస్ 24 శాతానికి పడిపోవడంతో, ఆ ప్రభావం రాష్ట్రాలపై పడుతుందని అందుకే ఎన్ని నిధులు అందుబాటులో ఉంటాయో అంచనా వేయాలని అధికారులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news