హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో వారం వారంకు పూర్తిగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తొలి వారం ఏడుపులతో బిగ్ బాస్ షో సాగగా రెండో వారమంతా మోనాల్, అభిజిత్, అఖిల్ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ కొత్త చర్చకు దారితీసింది. ఇప్పటికే హౌస్ మేట్స్ లో ఒకరిపై ఒకరికి అభిప్రాయాలు ఏర్పడ్డాయి. మరోవైపు షోలో కొత్త లవ్ ట్రాక్స్ ఏర్పడుతున్నాయి. ముక్కూమొహం తెలియని కంటెస్టెంట్లు అయినప్పటికీ ఈ షో కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది.

సోహెల్-అరియానా, అభిజిత్ – హారిక, అభిజిత్ – సుజాత లవ్ ట్రాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అభిజిత్ లవ్ స్టోరీలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ విషయానికి వస్తే అమ్మ రాజశేఖర్ అరియానాతో దేవి తనకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తోందని చెప్పారు. గెలవడం కోసం ఆమె ఏదైనా చేస్తుందంటూ కామెంట్లు చేశారు. మరోవైపు బిగ్ బాస్ హౌస్ మేట్స్ అంతా అభిజిత్ ను ఏకగ్రీవంగా రేషన్ డీలర్ గా ఎన్నుకున్నారు.

అనంతరం మోనాల్ కిచెన్ లో కూర్చున్న అఖిల్ కళ్లను మూయగా అఖిల్ అరియానా అని చెప్పడంతో మోనాల్ ఫీలైంది. తాను అరియానాలా కనిపిస్తున్నానా..? అని కామెంట్ చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఒక్కొక్కరూ ఇద్దరి చొప్పున నామినేట్ చేయాలని సూచించారు. హౌస్‌మేట్‌ ఫోటోను అగ్నిలో వేసి నామినేట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. కెప్టెన్ అయిన నోయల్ మాత్రం ఒకరిని మాత్రమే నామినేట్ చేయాలని చెప్పగా నోయల్ లాస్యను నామినేట్ చేశాడు.

నామినేషన్ సందర్భంగా సొహైల్, అరియానా మధ్య చిన్న గొడవ జరిగింది. సొహైల్ నామినేట్ చేయడానికి చెప్పిన కారణాలు అరియానాకు నచ్చకపోవడంతో ఒకరిపై ఒకరు సీరియస్ అయ్యారు. ఈ వారం మెహబూబ్‌, అరియానా, కుమార్‌, మోనాల్‌, హారిక, లాస్య, దేవి నామినేట్ అయినట్టు బిగ్ బాస్ తెలిపారు. ఈ వారం కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.