కట్టప్పలా మారుతున్న అభిజిత్.. తెలుగు పద్యాలు చెప్పిన మోనాల్!

మూడో వారంలో బిగ్ బాస్ షో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. హౌస్ లోని కంటెస్టెంట్లు సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ఫిజికల్ టాస్క్ కంటెస్టెంట్ల మధ్య గొడవలకు కారణమైంది. మెహబూబ్, దేవి మధ్య కొంత సమయం వాగ్వాదం చోటు చేసుకోగా చివరకు కంటెస్టెంట్లు ఇద్దరికీ సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇకపోతే ఆరు పదుల వయస్సులో ఫిజికల్ టాస్క్ లు ఆడుతుందా..? అనే అనుమానాలను గంగవ్వ పటాపంచలు చేసింది.

నిన్నటి ఎపిసోడ్ లో మోనాల్ బావా బావా పన్నీరు చెప్పి తనకు తెలుగులో మాట్లాడటం రాకపోయినా పద్యాలు మాత్రం అద్భుతంగా చెప్పగలనని ప్రూవ్ చేసింది. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు ఉక్కు హృదయం అనే టాస్క్ ఇచ్చాడు. ఇంటి సభ్యులను రోబోల టీమ్, మనుషుల టీమ్ గా వేరు చేశాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న బాల్ ను మనుషుల టీమ్ పగలగొట్టి అన్ని రోబోలను చంపేస్తే మనుషుల టీమ్ గెలుస్తుంది.

అలా కాకుండా ఒక్క రోబో బ్రతికి ఉన్నా రోబోల టీమ్ గెలుస్తుంది. గెలిచిన టీమ్ లోని సభ్యులు మాత్రమే కెప్టెన్ పోటీకి అర్హులని బిగ్ బాస్ చెప్పాడు. లాస్య‌,అవినాష్‌, అభిజిత్‌, గంగ‌వ్వ‌, హారిక, దేవి, అరియానా, కుమార్ సాయి రోబోల టీమ్ లో అమ్మ రాజ‌శేఖ‌ర్‌, దివి, నోయ‌ల్‌, సోహైల్, సుజాత‌, అఖిల్‌ మనుషుల టీమ్ లో ఉన్నారు. బజర్ మోగకముందే ఆట మొదలెట్టేసిన కంటెస్టెంట్లు రేషన్ దోచుకొనేందుకు ప్రయత్నించగా రేషన్ మేనేజర్ అభిజిత్ వారిపై సీరియస్ అయ్యాడు.

ఆ తర్వాత మనుషుల టీమ్ పై మనం గెలవలేమంటూ అభిజిత్ హౌస్ మేట్స్ లో నెగిటివిటీని పెంచాడు. అనంతరం బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ బర్త్ డే వేడుకలు జరిగాయి. కేక్ లేకపోవడంతో ప్రొటీన్ పౌడర్ ను తినిపించి బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేశారు. అరియానా ఓడిపోయేలా ఉంటే పోరాడి ఓడిపోదామని అభిజిత్ కు చెప్పగా ఆమె చెప్పే సలహాలు పట్టించుకోలేదు. దీంతో అభిజిత్ కట్టప్పలా తయారయ్యాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫిజికల్ టాస్క్ లో మనుషుల టీమ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.