బిగ్ బాస్: కుమార్ సాయి ఎలిమినేషన్.. ప్రేక్షకులకి తగ్గిపోతున్న నమ్మకం..!

-

బిగ్ బాస్ నాలుగవ సీజన్లో ఈ వారం ఎలిమినేషన్ లో భాగంగా కుమార్ సాయి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. నామినేషన్లో ఉన్న తొమ్మిది మందిలో కుమార్ సాయి హౌస్ నుండి బయటకి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి హౌస్ లో కుమార్ సాయి పర్ ఫార్మెన్స్ బాగానే ఉందని, అతడు చాలా నిజాయితీగా గేమ్ ఆడుతున్నాడని చాలా మంది ఫీల్ అయ్యారు.

కానీ సడెన్ గా కుమార్ సాయి ఎలిమినేట్ అవడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోపై కామెంట్లు నెగెటివ్ వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ యాజమాన్యం వాళ్ళకి కావాల్సిన వాళ్ళనే హౌస్ లో ఉంచుతుందని, ఓట్లని అసలు పరిగణలోకి తీసుకోవడం లేదని అంటున్నారు. దేవి నాగవల్లి విషయంలోనూ ఇలాగే జరిగిందని, కేవలం డ్రామా పండించే వారిని మాత్రమే హౌస్ లో ఉంచుతుందని, రియాలిటీ షో లో రియల్ పర్ ఫార్మ్ చేస్తే తీసివేస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇలాగే కొనసాగితే బిగ్ బాస్ కి వచ్చే ఓట్లు తగ్గిపోతాయని అంటున్నారు. దానివల్ల బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు తగ్గిపోయే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ఫాలోయింగ్ లేని మోనాల్ హౌస్ లో ఉండడం కేవలం ఆమె ఇతరులతో చేస్తున్న స్నేహం ఒక్కటే కారణమని, అంతేకానీ పెద్దగా ఆడినట్లు కనబడలేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news