బిగ్ బాస్ ఎపిసోడ్ 2: ఏడుపులు.. కోపాలు.. స్ట్రాటెజీలు! మొదటిరోజే కావలసినంత డ్రామా!

-

సోమవారం బిగ్ బాస్ – 4 రెండవ ఎపిసోడ్ ‘సయ్యా…. సయ్యారే’ పాట తో మొదలైంది. ఈ పాటకి కంటెస్టెంట్స్ తో సహా గంగవ్వ కూడా కలిసి స్టెప్పులేయగా… సీక్రెట్ రూమ్ లో అరియానా, సోహైల్ కూడా తమదైన శైలిలో స్పందించి అలరించారు. ఆ తర్వాత డైరెక్టర్ సూర్య కిరణ్ ఇంటి సభ్యులకి చిన్న చిన్న వ్యాయామాలు ఎలా చేయాలో చేసి చూపించారు. మరో వైపు సీక్రెట్ రూమ్ లో ఉన్న అరియానా…. సోహైల్ వీపు మీద ఎక్కి కూర్చుంటే సోహైల్ పుష్-అప్స్ చేశాడు.

ఇక బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా పోస్ట్ కార్డ్‌ ద్వారా ఒక లేఖను పంపి, స్లిప్‌లో రాసి ఇచ్చిన దాని గురించి వివరించాలని కోరారు. “మీరు ఏదైనా విషయాన్ని జీవితంలో ఒక్కసారైనా ప్రయత్నించాలి అనుకుంటున్నారా” అని అమ్మరాజశేఖర్ సూర్య కిరణ్ ను అడగగా…. తను మందు, సిగరెట్ తాగడం అమ్మ దగ్గర దాచానని… ఈ షో ద్వారా ఆమెకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఇక మీ ఊరి గురించి చెప్పాలి అని మోనాల్ కి స్లిప్ అందించగా…. ఆమె ఆ విషయాన్ని పక్కన పెట్టి….. తన తండ్రి చనిపోయాడు అని…. తమను అంకుల్ చూసుకుంటున్నారని ఏడవడం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు చూసి గంగవ్వ కన్నీళ్లుపెట్టుకోగా దీంతో అంతా ఆమెను ఓదార్చడం మొదలెట్టారు.

అయితే సూర్య కిరణ్ మోనాల్ పై కొద్దిగా సీరియస్ అయ్యారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇలా తండ్రి వాదన తెచ్చినందుకు ఆమె పై సీరియస్ కాగా అభిజిత్ కలగజేసుకొని అది తన ఫీలింగ్ ను ఆమె వ్యక్తపరుస్తోంది అని అన్నాడు. అక్కడ ఒక చిన్నపాటి గొడవ జరగగా మోనాల్ మరింత ఏడ్చేసింది. మెహబూబా దిల్ సే సైతం తన పేరెంట్స్ ని గుర్తుతెచ్చుకుని కన్నీరు పెట్టుకున్నాడు. ఇక సీక్రెట్ రూమ్ లో ఉన్న సోహెల్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఇక్కడ సోహెల్ బిగ్ బాస్ లాగా మాట్లాడగా…. నోయల్ మాత్రం ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి పక్కన అమ్మాయి ఉందని అతను బిగ్ బాస్ కాదని కనిపెట్టాడు.

ఇదే సమయంలో ఫోన్ మాట్లాడిన కళ్యాణితో సుజాత్ ఫోన్ చేసింది ఎవరో తెలుసుకోవాలి కదా అని అనడంతో ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే సుజాత కాస్తా కన్నీళ్లు పెట్టుకుంది. ఈ విషయంలో కరాటే కళ్యాణి కొంచెం కటువుగానే మాట్లాడింది అనే చెప్పాలి. ఇక సీక్రెట్ రూమ్ లో ఉన్న వారికి భోజనాన్ని పంపించారు కానీ అక్కడ ఉన్నది కంటెస్టెంట్స్ అన్న విషయం మిగతా వారికి క్లారిటీ రాలేదు.

ఇక అసలు విషయానికి వస్తే ఈ సీజన్ లో మొట్టమొదటి ఎలిమినేషన్ లో ఇద్దరు ఇద్దరు చొప్పున కిటికీ దగ్గర నిలబడగా మిగిలిన సభ్యులు ఏకాభిప్రాయం తో వారిలో ఒకరిని ఎలిమినేషన్ కి నామినేట్ చేయాలని బిగ్ బాస్ సూచించారు. వీరందరిలో.. నోయల్ – గంగవ్వ జంటలో ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో గంగవ్వను చాలా తెలివిగా నామినేట్ చేశారు. కచ్చితంగా గంగవ్వ ఎలిమినేషన్ నుండి బయట పడుతుందని…. ఆమెకు బయట చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని…. అందుకే తనను నామినేట్ చేస్తున్నట్లు చెప్పారు. మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్ లో అభిజిత్, సూర్యకిరణ్, మెహబూబా, అఖిల్ సార్దక్, సూర్య కిరణ్, సుజాత, దివి, గంగవ్వ నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news