‘బ్లఫ్ మాస్టర్’తో మెప్పించి.. ఆ తర్వాత ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రంతో తన ఉగ్ర రూపాన్ని చూయించి.. హీరోగా మంచి పేరు తెచ్చుకున్న సత్యదేవ్ కి తాజాగా మరో చిత్రంలో హీరోగా నటించే అవకాశం వచ్చింది. ‘తిమ్మరుసు’ అనే టైటిల్, ‘అసైన్‌మెంట్ వాలి’ అనే ట్యాగ్‌లైన్‌తో సత్యదేవ్ కొత్త చిత్ర ప్రకటన చేశారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా టైటిల్ లోగోను సోమవారం విడుదల చేశారు. నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
I’m so pleased to announce My Next film #Thimmarusu.
Produced by Mahesh S Koneru & Srujan Yarabolu.
Directed by Sharan Koppisetty.Shoot Begins Soon. @smkoneru @nooble451 @EastCoastPrdns @SOriginals1 @kooldudesharan. pic.twitter.com/KxYXR6yFKG
— Uma Maheswara Rao (@ActorSatyaDev) September 7, 2020
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరుతో కలిసి ఎస్ ఒరిజినల్స్ బ్యానర్‌పై నిర్మాత సృజన్ ఎరబోలు ‘తిమ్మరుసు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని నటీనటుల గురించి, ఈ సినిమా పూర్తి వివరాల గురించి త్వరలోనే అనౌన్స్ చేయనుంది చిత్ర యూనిట్. ఇకపోతే సత్యదేవ్.. ప్రస్తుతం తమన్నా సరసన ‘గుర్తుందా శీతాకాలం’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.