బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో మొదలైన రోజు నుంచి గంగవ్వ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కేవలం గంగవ్వ కోసమే బిగ్ బాస్ షోను వీక్షిస్తున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. తొలివారం అనధికారికంగా జరిగిన సర్వేల్లో 40 నుంచి 50 శాతం ఓట్లు గంగవ్వకు పడ్డాయంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో సులభంగానే అర్థమవుతోంది. వీక్షకులు గంగవ్వను బిగ్ బాస్ షోలో చూసి థ్రిల్ గా ఫీల్ అవుతున్నా ఆమెకు మాత్రం ఆ ఇంట్లో ఉండటం నచ్చడం లేదు.
నిన్నటి ఎపిసోడ్ లో ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆదివారం రోజున సాయికుమార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా ముక్కు అవినాష్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ వారం ఇద్దరి ఎలిమినేషన్ పక్కా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హారిక సుజాతను బిగ్ బాస్ హౌస్ లో బాయ్ ఫ్రెండ్ ను వెతుక్కోవాలంటే ఎవరిని వెతుక్కుంటావు…? అని ప్రశ్నించింది. సుజాత ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్ అని జవాబు ఇచ్చి అక్కడినుంచి మెల్లగా జారుకుంది.
సుజాత నోయల్ తో నీకు నాకు మధ్య ఏదో ఉందని అందరూ అనుకుంటున్నారని చెప్పగా సుజాతను తాను సిస్టర్ లా చూస్తున్నానని నోయల్ అన్నాడు. ఇక వంటగదిలో అఖిల్ అభిజిత్ మధ్య సామాన్లు తోమే విషయంలో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అనంతరం సాయి కుమార్, అవినాష్ రెండు టీంలుగా విడిపోయి కామెడీ స్కిట్ లు చేయాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. మరోవైపు ఏసీ వాతావరణం, తిండి శరీరానికి సరిపడక గంగవ్వ అస్వస్థతకు లోనైంది.
భర్త కొట్టిన దెబ్బలు తనకు నొప్పెడుతున్నాయని… రెండు నెలలు ఉందామనుకున్నానని కానీ ఉండలేకపోతున్నానని చెప్పింది. బిగ్ బాస్ ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినా గంగవ్వ మాత్రం వినలేదు. బిగ్ బాస్ ప్రేమికులు కూడా గంగవ్వను ఇంటికి పంపించడమే బెటర్ అని భావిస్తున్నారు. అయితే గంగవ్వ తనంతట తాను వెళ్లిపోవాలంటే మాత్రం బిగ్ బాస్ నిర్వాహకులకు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఆ వాతావరణంలో ఉండలేకపోతున్న గంగవ్వ విషయంలో బిగ్ బాస్ ఎలా వ్యవహరిస్తాడో చూడాల్సి ఉంది.