బిగ్ బాస్: స్నేహ బంధానికి ఫుల్ స్టాప్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

ఈ వారం బిగ్ బాస్ షోలో అఖిల్ సీక్రెట్ రూంలోకి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన దీపావళి పండగ సంబరానికి కూడా అఖిల్ హాజరు కాలేదు. శనివారం నాగార్జున గారితో చేసే సందడిని కుడా అఖిల్ మిస్సవుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనే విషయం అందరిలో ఆసక్తి కలిగిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం, మోనాల్ ఈ వారం హౌస్ నుండి బయటకు వెళ్ళనుందట.

నిజంగా ఓటింగ్ ప్రకారమే జరిగితే మోనాల్ ఎలిమినేట్ అవ్వాల్సిందే అని మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ అఖిల్, మోనాల్ మధ్య స్నేహంలో కొంత గ్యాప్ వచ్చింది. దాంతో మోనాల్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. మోనాల్ కారణంగా అఖిల్ ఆటలో చాలా మార్పు వస్తుందని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. అందువల్ల ఆమెని ఇంటి నుండి బయటకు పంపించేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. మరి నిజంగా మోనాల్ ఎలిమినేట్ అవుతుందా లేదా చూడాలి.