వాళ్లనే పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టండి : బాబు ఆదేశాలు

-

మరికొద్ది రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీలు ఎన్నికల మీద దృష్టి పెట్టాయి. ఇక తెలంగాణలో ఇంకా పార్టీ ఉంది అని నిరూపించుకోవడానికి టిడిపి అనేక తంటాలు పడుతోంది. ఈ క్రమంలోనే ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన నాయకులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రేటర్ ఎన్నికల విషయంలో పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ ఎన్నికల గురించి ఈ చర్చ సాగింది. ఈ సందర్భంగా అన్ని రకాల సమర్థవంతుడైన అలానే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న వాళ్లనే పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టాలని ఆయన నేతలకు సూచించారు.

పార్టీ టికెట్ ని ఆశించే ఆశావహుల జాబితా అని నాలుగు వర్గాలుగా విభజించి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని ఆయన సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రాష్ట్ర స్థాయి నేతని ఇన్చార్జిగా నియమించి అభ్యర్థి సెలక్షన్ మొదలు వారిని గెలిపించే బాధ్యత వరకు ఆయనకు పూర్తి అధికారాలు ఇవ్వాలని ఆయన రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. టికెట్ ఎవరికి వచ్చినా రాగద్వేషాలకు లోనవ్వకుండా గెలుపే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని, హైదరాబాద్లో గనుక పార్టీ బలపడితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రౌండ్ లోనే కాక సోషల్ మీడియాలో కూడా భారీ ఎత్తున ప్రచారం చేయాలని ఆయన ఆదేశించారు. హైదరాబాదులో ఉన్న ప్రతి ఇంటికి టిడిపి వెళ్లాలని ఆయన సూచించారు. తన తరఫున ఏపీ నుంచి కంభంపాటి రామ్మోహన్రావు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news