బిగ్ బాస్: హౌస్ నుండి మోనాల్ ఔట్..?

-

బిగ్ బాస్ నాలుగవ సీజన్ చివరి దశకి వచ్చేసింది. ఫైనల్స్ కి దగ్గర పడుతున్న కొద్దీ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయం అందరిలో ఆసక్తి రేపుతుంది. మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లలో ఎవరో ఒకరు హౌస్ నుండి బయటకు వెళ్ళనున్నారు. తాజా సమాచారం ప్రకారం మోనాల్ ఎలిమినేట్ అవుతుందని అంటున్నారు. బిగ్ బాస్ మొదలయినప్పటి నుండి ప్రేక్షకుల నెగెటివిటీ ఎదుర్కొంటున్న మోనాల్, బిగ్ బాస్ చివరి దశకి వస్తున్న తరుణంలో ఎలిమినేట్ కానుందని వినిపిస్తుంది.

ప్రతీ చిన్న విషయానికి కన్నీళ్ళు పెట్టుకోవడం, ఆటలో ఏమాత్రం పార్టిసిపేట్ చేయకపోవడం మొదలగు విషయాలన్నీ మోనాల్ ని ఎలిమినేట్ అయ్యేలా చేస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐతే మరో పక్క జబర్దస్త్ నటుడు అవినాష్ ఎలిమినేట్ అయ్యే సూచనలు ఉన్నాయని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. కానీ మోనాల్ కంటె ఎక్కువ ఓట్లు అవినాష్ కి రావడంతో అతను సేవ్ అవుతున్నాడని తెలుస్తుంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు సేవ్ అయ్యి, ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకోవాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version