కర్ణాటక హై కోర్టులో శశికళకు చుక్కెదురు..!?

-

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ. అయితే కర్ణాటక హైకోర్టులో శశికళకు చుక్కెదురైంది. శశికళ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కర్ణాటక కోర్టు కొట్టి వేసింది. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ తనను ముందుగా విడుదల చేయాల్సిందిగా జైలు అధికారులకు పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించింది కర్ణాటక కోర్టు.

sasikala

సత్ర్పవర్తన కలిగిని ఖైదీలను జైలు అధికారులు ముందుగానే విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలో ఆమె దరఖాస్తు చేసుకుంది. ఇంతకు ముందు సైతం ఇలాగే శశికళ గతంలో 120 రోజులకు పైగా రెమిషన్‌ ఉన్నా.. అప్పటి జైలర్‌ దాన్ని రద్దు చేశారు. జనవరి మాసంలో ఆమెకు జైలు నుంచి విముక్తి కలగనుందని వార్తలొచ్చాయి. ఈ వార్త తమిళ రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించింది. హఠాత్తుగా కర్నాటక హైకోర్టు ముందస్తు బెయిల్‌ ను కొట్టివేసిన నేపథ్యంలో ఆమె శిబిరం డీలా పడిపోయింది.

ఈ నేరాలకు సత్ప్రవర్తన వర్తించదని మంత్రి బసవరాజ్ అన్నారు. ఈ ప్రకారం శశికళ నాలుగేళ్లు పూర్తిగా జైలు జీవితం గడపాలి, ముందుగా విడుదలకు అవకాశాలు తక్కువని స్పష్టం చేశారు. బసవరాజ్‌ వ్యాఖ్యలతో శశికళ అభిమానులు డీలా పడిపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్ల జరినామా కూడా చెల్లించారు. ఇటీవల బెంగళూరు జైలు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించాడు.

ఈనేపథ్యంలో చట్టాన్ని అనుసరించే శిక్షకాలం ఉంటుంది, ఇందులో రాజకీయ ప్రమేయానికి ఎంతమాత్రం చోటులేదని పేర్కొన్నారు. మరోవైపు ముందస్తు విడుదలకు అవకాశం లేదని కర్ణాటక మంత్రి స్పష్టం చేయడంతో బెంగళూరు కోర్టులో శుక్రవారం పిటిషన్‌ వేయాలని శశికళ న్యాయవాదులు నిర్ణయించారు. జరిమానా చెల్లింపు కూడా పూర్తయినందున శశికళను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పిటిషన్‌ ధాఖలు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version