ప్రేక్షకులను బకరాలను చేసిన బిగ్ బాస్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

గత ఆదివారం రోజున బిగ్ బాస్ షో సీజన్ 4 గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ లో ముక్కూమొహం తెలియని సెలబ్రిటీలే ఎక్కువ మంది ఉన్నారు. ఆరేడు మంది కంటెస్టెంట్లు మినహా మిగిలిన వాళ్లంతా కొత్తవాళ్లే కావడంతో వీక్షకులకు కూడా బిగ్ బాస్ 4 పై ఆసక్తి క్రమంగా సన్నగిల్లుతోంది. అయితే తాజా ఎపిసోడ్ తో బిగ్ బాస్ ప్రేక్షకులను పిచ్చోళ్లను చేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ షో ప్రారంభమైన మరుసటి రోజు నుంచి కట్టప్ప పేరు చెప్పి బిగ్ బాస్ చేసిన హడావిడి అంతాఇంతా కాదు. షో చూసేవాళ్లు సైతం బిగ్ బాస్ హౌస్ లో కట్టప్ప ఉన్నాడని భావించారు. అయితే క‌ట్ట‌ప్ప ఎపిసోడ్‌ ఉత్తిదేన‌ని తేలడంతో బిగ్ బాస్ షో నిర్వాహకులపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రేక్షకులను పూల్స్ చేసే ప్రయత్నం చేయొద్దనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

హోస్ట్ అక్కినేని నాగార్జున మీలో ఉన్న అనుమానమే కట్టప్ప అని… ఇంటి సభ్యులలో ఒకరితో మరొకరికి సంబంధాలు బలపడలేదని…. గత సీజన్లకు భిన్నంగా ఈసారి 5 కోట్ల ఓట్లు పడ్డాయని తెలిపారు. ఎన్నాళ్లకు గుర్తొచ్చానా వాన పాటతో ఎపిసోడ్ ప్రారంభం కాగా ఇంటి సభ్యులు అందంగా ముస్తాబయ్యారు. నాగార్జున నోయల్ ను ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలని సూచించాడు. సొహైల్ అరియానాను వీపుపై మోస్తూ పుష‌ప్స్ చేయాలని నాగ్ ఆదేశించి వాళ్లు చేసేలా చేశాడు.

మోనాల్ ను డ్యామ్ కట్టేయాలని…. లాస్యలో జోష్ తగ్గిందని…. సూర్యకిరణ్ కు అనవసరంగా లెక్చర్లు ఇవ్వవద్దని సూచనలు చేశారు. ఒకచోట జరిగిన విషయాలు మరొకచోట చెప్పరాదని కల్యాణికి సూచించారు. అనంతరం సొహైల్, అరియానాతో బొమ్మ‌లు ఉన్న మెడ‌ల్స్‌ను కంటెస్టెంట్ల మెడలో వేయాలని చెప్పారు. లాస్యను ఫస్ట్ కెప్టెన్ గా ప్రకటించిన నాగ్ గంగవ్వ, సుజాత, అభిజిత్ లను సేవ్ చేశారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ వారం సూర్యకిరణ్ లేదా మెహబూబ్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.