ఏంట్రా ష‌ణ్‌.. ఏంటీ క‌థ‌..! ష‌ణ్ముఖ్‌కు మ‌రిచిపోలేని బ‌ర్త్ డే గిప్ట్ ఇచ్చిన బిగ్‌బాస్

Bigg Boss 5: బిగ్‌బాస్5 హౌస్ లో హంగామా మాములుగా లేదు. కంటిస్టెంట్స్ హౌస్‌లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులకు కావాల్సినంతా ఎంటర్‌టైన్మెంట్ ను అందిస్తున్నారు. మంచి జోష్ తో బిగ్‌బాస్ షో విజ‌య‌వంతంగా రెండో వారంలోకి ఎంటర్ అయింది.

ఈ రోజు (సెప్టెంబ‌ర్ 16) బిగ్ బాస్ కంటిస్టెంట్, సూర్య వెబ్ సిరీస్ ఫేం ష‌ణ్ముఖ్ పుట్టిన రోజు కావ‌డంతో అత‌నికి బిగ్ బాస్ జీవితంలో మ‌రిచిపోయి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ అందించాడు. తాజా ప్రోమోలో ఈ ఆస‌క్తిక‌ర విష‌యం తెలుస్తుంది. వివ‌రాల్లోకెళ్తే.. ప్ర‌ముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ ..త‌నదైన‌ న‌ట‌న‌తో యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్ చేస్తూ.. యువ‌త దృష్టిని ఆక‌ర్షించాడు. సోష‌ల్ మీడియా క్రేజ్ సంపాదించుకున్నాడు.

అదే స‌మ‌యంలో.. ఒకప్పుడు ఇదే బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసిన దీప్తి సునయనతో మ‌నోడు లవ్ ట్రాక్ న‌డుపుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తునే ఉన్నాయి. వారిద్ద‌రూ ప్రేమ‌లో మునిగి తేలుతున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇదే విష‌యం ష‌ణ్ముఖ్ కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే ముందు కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పేశాడు.

అయితే.. ఇదే మంచి స‌మ‌యమ‌ని ష‌ణ్ముఖ్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వాల‌నుకున్నాడో ఏమో.. తెలియ‌దు గానీ.. నేరుగా త‌న ల‌వ‌ర్ దీప్తి సునయనతో ష‌ణ్ కు మరవలేని గిఫ్ట్ అందించాడు. వీడియో కాల్ ద్వారా దీప్తితో మాట్లాడించింది. థ్రిల్ చేశాడు. అందులో ”హలో షన్ను.. ఐ లవ్ యూ” అంటూ దీప్తి త‌న మ‌న‌సులోని మాటను చెప్పింది. దీంతో షణ్ముఖ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.

అదే స‌మ‌యంలో బిగ్ బాస్ హౌస్ బయట తన స్నేహితులతో కలిసి టపాసులు కాలుస్తూ దీప్తి ఎంజాయ్ చేసినట్లు వీడియోలో చూపించారు. ఈ మూమెంట్ తో వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న‌ రిలేషన్ ఏంటనేది కన్ఫర్మ్ అయింది. మరోవైపు దీప్తి త‌న ఇన్స్‌స్టాగ్రామ్‌లో షణుతో క‌లిసి దిగిన ఫోటోను షేర్ చేసి షణ్ముఖ్‌పై ఉన్న ప్రేమను బ‌య‌ట పెట్టింది. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.