బిగ్ బాస్: అందరి ముందు ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆదిరెడ్డి..!

-

ప్రస్తుతం బిగ్ బాస్ ఆరవ సీజన్ 3 రోజుల్లో 14వ వారాన్ని కూడా పూర్తి చేసుకోబోతోంది. ఇంకొన్ని రోజుల్లో టైటిల్ విన్నర్ ని కూడా ప్రకటిస్తారు. ఇందుకోసం ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఏడు మంది కంటెస్టెంట్లు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఇకపోతే వీరందరూ కోల్పోయిన విన్నర్ ప్రైజ్ మనీని తిరిగి గెలుచుకునేందుకు బిగ్ బాస్ ఈవారం అంతా చాలెంజ్ లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే గత రాత్రి బుధవారం నాటి 95 వఎపిసోడ్లో లేడీ కంటెస్టెంట్ పై ఆదిరెడ్డి షాకింగ్ కామెంట్లు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

ఇక చాలెంజ్ టాస్క్ లో భాగంగా కన్ఫ్యూషన్ రూమ్ ను డార్క్ రూమ్ గా మార్చి.. అందులో పాములు, ఎలుకలు, దెయ్యాలు వంటి భయంకరమైన సౌండ్ ఎఫెక్ట్స్ తో నింపారు. డార్క్ రూమ్ కి మొదటగా ఆదిరెడ్డి వెళ్లి భయంతో తన యాసలో మాట్లాడిన తీరు అందరికీ నవ్వు తెప్పించింది. లోపలికి రండి అని బిగ్ బాస్ అంటే యాడకి బిగ్ బాస్ వచ్చేది అంటూ కామెడీ తెప్పించాడు. తర్వాత సౌండ్స్ ఓకే కానీ కాళ్లు చేతులు పట్టుకొని లాగద్దు.. దగ్గరికి వస్తే కొట్టేస్తాను అంటూ గట్టిగా అరుస్తూ భయపడ్డాడు. దాంతో శ్రీహాన్ ను కూడా తోడుగా పంపించారు బిగ్బాస్. అయితే అతడు కూడా చాలా భయపడ్డాడు.

ఇదిలా ఉండగా ఈ ఎపిసోడ్ ముందు రోజు రాత్రి కూడా భయంకరమైన అరుపులు వినిపించాయి. హౌస్ మేట్స్ అంతా కలిసి బాత్రూం లో దాక్కున్నారు. ఇదంతా అయ్యాక ఆది రెడ్డిని ఇనయా తెగ భయపెట్టేసింది. అచ్చం దెయ్యం వచ్చిన అమ్మాయిలా మాట్లాడుతూ ఆదిరెడ్డికి చుక్కలు చూపించింది . అయితే అదంతా నటన అని తెలిసి కూడా భయపడిపోయాడు ఆదిరెడ్డి. అయితే మరుసటి రోజు డిస్కషన్ చేసుకుంటూ ఉండగా ఈనెల అందరిని వెర్రిపప్పల్లా చేసింది అని రేవంత్ అనడంతో చూడడానికి రేవులో తాడి చెట్టులా ఉన్నాడు అని ఆదిరెడ్డిని రేవంత్ అన్నాడు. దీంతో అందరి ముందు దయ్యాల సినిమాలకు సెట్ అవుతుంది ఇనయా అని ఆదిరెడ్డి అనడం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news