Bigg Boss 5 Telugu: అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. బెడిసికొట్టిన రవి, శ్రీ రామ్ ల ప్లాన్

-

Bigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్ష‌కులకు పుల్ మీల్స్ లాంటి.. ఎంట‌ర్టైన్ మెంట్ అందిస్తున్న షో బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5. ఈ షో లోకి 19 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా.. పదిమంది ఎలిమినేట్ కాగా ప్రస్తుతం తొమ్మిది మంది కంటెస్టెంట్స్ హౌస్ లో మిగిలారు. ఇప్ప‌టికే.. సగం షో పూర్తి కావ‌డంతో.. టాప్ మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్స్ ఎవ‌రో ఇప్పటికే.. తేలిపోయింది. ఓటింగ్ ప‌రంగా ఏ కంటెస్టెంట్ కు ఎంత ఫాలోయింగ్ ఉంద‌నే విష‌యం కూడా తెలిసిపోయింది.

పరిస్థితి ఇలా ఉంటే హౌస్ లో ఇద్దరు కంటెస్టెంట్ లు మాత్రం చాలా స్పెష‌ల్ అనే చెప్పాలి. ఆ ఇద్ద‌రూ కంటెస్టెంట్స్ హౌస్ ను కంట్రోల్ చేస్తున్న‌ట్టు అనిపిస్తోంది. అనుకున్న రీతిలో.. ఇత‌ర కంటెస్టెంట్ల‌ను ఆడిస్తున్నారు. ఆడుకుంటున్నారు. వారిద్ద‌రెవ‌రో కాదు.. యాంకర్ ర‌వి, మ‌రోక‌రూ సింగ‌ర్ శ్రీరామ్.
వీరిద్ద‌రూ మైండ్ గేమ్ ఆడ‌టంలో ఎక్స్ ఫ‌ర్ట్స్. ఇందులో ర‌వి గురించి అంద‌రికి తెలుసు.. త‌న ఇత‌ర కంటెస్టెంట్ల‌ను ఇన్ ఫ్యూలెస్ చేయ‌డంతో కింగ్.. త‌న మాటల గార‌డీతో ఇత‌ర కంటెస్టెంట్స్ మ‌య చేస్తాడని తెలుసు. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే చాలా మంది కంటెస్టెంట్స్ చెప్ప‌క‌నే చెప్పుకోచ్చారు. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఓపెన్ గానే గుంట నక్క అనే టైటిల్ ఇచ్చేశారు. ఇక సింగ‌ర్ శ్రీ‌రామ్ ..మ‌నోడు బ‌య‌ట ప‌డ‌డు..కానీ ఎక్కువగా స్ట్రాటజీలు వేసేది అత‌డే.. కూల్ గా త‌న గేమ్ ను తాను ఆడుతూ.. ఇద్ద‌ర‌ల‌ను ట్రాప్ చేయ‌డంలో కింగ్.

ఇక‌.. ఈ వారంలో వారిద్ద‌రి వ్య‌వ‌హ‌ర శైలి చూస్తుంటే.. హౌస్ మొత్తాన్ని త‌మ కంట్రోల్ లోకి తెచ్చుకోవాలంటే.. మెయిన్ కంటెస్టెంట్ అయిన‌.. స‌న్నీని టార్గెట్ చేయ‌డానికి ట్రై చేశారు. అనుకున్న విధంగానే పావులు క‌దిపారు. పైగా.. ఈ వారం కెప్టెన్ ర‌వి కావ‌డం, అలాగే.. కెప్టెన్సీ టాస్క్ లో సంచాల‌కుడుగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం రావ‌డం అత‌నికి క‌లిసి వ‌చ్చాయి.

అనుకున్న రీతిలోనే.. సన్నీ నీ ఈ వారం చాలానే ఇబ్బందులపాలు చేయడం జరిగిందని.. చెప్పుకొస్తున్నారు. అనుకున్న‌ట్టుగానే కెప్టెన్సీ టాస్కులో భాగంగా నిర్వ‌హించినా.. స్విమ్మింగ్ పుల్ టాస్క్ లో మ‌ధ్య‌లో కొత్త రూల్స్ పెట్టి స‌న్నీని ఎర్రి పుష్పం చేశారు. ఈ టాస్కులో స‌న్నీ, మాన‌స్ మ‌ధ్య వివాదం జ‌రిగేలా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు అనిపిస్తుంది. ఇదే త‌రుణంలో కాజ‌ల్ ని కూడా కంట్రోల్ చేసే రీతిలో ప్ర‌వ‌ర్తించారు ర‌వి, శ్రీ‌రామ్ లు. దాదాపు శ్రీరామ్ రవి వేసిన ఎత్తుగడగా వల్లనే 11వ వారం లో అనేక మార్పులు గేమ్ లో అనేక ట్విస్టులు చోటుచేసుకున్నాయని అంటున్నారు.

కెప్టెన్సీ టాస్క్ లో పోటీదారుల్లో పింకీ, సిరి, ఆనీ మాస్టారు పోటీలో ఉంటేలా గేమ్ ను నడిపించారు. కానీ.. చివ‌రి నిమిషంలో బిగ్ బాస్ అనుకోని షాక్ ఇచ్చారు. రవి, శ్రీ రామ్ ప్లాన్ బెడిసి కొట్టేలా.. మరో కంటెస్టెంట్ ను పోటీలో నిలిపేలా అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో కెప్టెన్సీ కంటెడ‌ర్ పోటీలో మాన‌స్ వ‌చ్చాడు. దీంతో రవి, శ్రీరామ్ ల‌ ప్లాన్ చిత్తు అయ్యింది. ప్రోమోల ప్ర‌కారం.. కొత్త కెప్టెన్ గా మానస్ అయినట్లు వార్తలు వ‌స్తున్నాయి. దీంతో రవి, శ్రీ రామ్ ల‌కు బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news