నాకు ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉంది..: చంద్రబాబు పై రోజా సెటైర్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ మీట్ లో బోరున ఏడ్చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఏడవటం పై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి సెటైర్లు పేల్చారు. చంద్రబాబు నాయుడు ఏడవటం తనకు చాలా ఆనందంగా ఉందని… రోజా ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు… ఎన్టీ రామారావు ను ఏడిపించిన సంగతి ఎవరు మర్చిపోలేదని తెలిపారు.

పైన దేవుడు ఉన్నాడని.. అందుకే చంద్రబాబు చేత ఈరోజు కంటతడి పెట్టించాడు అని చురకలంటించారు ఎమ్మెల్యే రోజా. అంతేకాదు గతంలో వైయస్ విజయమ్మ అలాగే వైయస్ భారతి నీ కూడా చంద్రబాబు ఏడిపించారని మండిపడ్డారు. తనను కూడా చంద్రబాబు… అనేక అవమానాలు చేశాడు అని మండిపడ్డారు. “కర్మ ఫలితం అనుభవించు బాబు, అధికారం చేతిలో ఉందని మహిళలు అని కూడా చూడకుండా నాడు నన్ను, జగనన్న కుటుంబసభ్యులను మానసిక క్షోభకు గురిచేసింది మరిచిపోయావా? నీ దొంగ ఏడుపులు రాష్ట్ర ప్రజలు నమ్మరు బాబు !” అంటూ మండిపడ్డారు రోజా.