ఈరోజు అసెంబ్లీ సమావేశాల నుండి చంద్రబాబు బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ అంశంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. ఇదంతా చంద్రబాబు ముందస్తుగా రచించుకున్న వ్యూహంలో భాగమేనని కొడాలి ఆరోపించారు. ఇకపై అసెంబ్లీకి వెళ్లకుండా ఏం చేయాలనేది గురువారం సాయంత్రమే పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించుకుని దానిని ఈరోజు అమలు చేశారని అన్నారు. ఈ విషయం పై తనకు ముందస్తు సమాచారం ఉందని కొడాలి నాని ఆరోపించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ తనతో ఇప్పటి దాకా అదే విషయంపై మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోతున్నారు అని బొత్స సత్యనారాయణ చెప్పారని తెలిపారు. అదే సమయంలో చంద్రబాబు తన ప్లాన్ ను పక్కాగా అమలు చేశారని చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యేదాకా అసెంబ్లీలో అడుగు పెట్టనంటూ మొసలికన్నీరు కారుస్తూ అసెంబ్లీ బైకాట్ చేశారు అంటూ కొడాలి సంచలన ఆరోపణలు చేశారు.