బిగ్ బాస్: లోబో నవ్వులు.. లహరి అరుపులు.. ఆసక్తిగా సాగిన నాలుగవ ఎపిసోడ్

నాలుగవ రోజు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు అందరూ ప్రేక్షకులకు చక్కటి వినోదన్ని పంచారు. ముందుగా మూడవ రోజు యానీ మాస్టర్, జస్వంత్ మధ్య జరిగిన గొడవ, నాలుగవ రోజు సారీ చెప్పడంతో పూర్తయ్యింది. ఇక్కడికే అయిపోయింది, ఖేల్ ఖతం అని తేల్చేసారు. ఇక ఆ తర్వాత అందరూ నిద్రపోయిన తర్వాతే కాజల్ నిద్రపోవాలని మానస్ కి పవర్ ఇచ్చిన బిగ్ బాస్, కాజల్ కి కష్టాలు తెచ్చాడని చెప్పుకోవాలి. చాలా సేపు నిద్రలేకుండా చేసి లహరి, కాజల్ మధ్య చిచ్చు పెట్టాడు.

వీరిద్ద్దరి మధ్య జరిగిన గొడవ చిలికి చిలికి పెద్దగా మారింది. లహరి అరవడాలు, కాజల్ ఏడుపులు బిగ్ బాస్ హౌస్ ని ఒకరకంగా మార్చేసాయి. ఆ తర్వాత షణ్ముఖ్ జస్వంత్, లోబో మధ్య జరిగిన సంఘటనలు ప్రేక్షకులకు నవ్వు తెప్పించాయి. షణ్ముఖ్ కి సేవకుడిగా మారిన లోబో, హౌస్ లో ఎవరెవరు ఎలా చేస్తున్నారనేది ఇమిటేట్ చేసాడు. అందులో యానీ మాస్టర్ లా లోబో నవ్వులు తెప్పించాడు. యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్ లా అనుకరించి అందరికీ నవ్వులు పంచాడు.

అనంతరం ఉమాదేవి గారు కొంత కంటెంట్ కోసం ప్రయత్నించినట్లు తెలుస్తుంది. బంగాళదుంప కర్రీ ఈ కంటెంట్ తీసుకోవడానికి కారణమైంది. ఈ విషయంలో యానీ మాస్టర్, ఉమాదేవి గారికి సారీ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. మొత్తానికి మూడు నవ్వులు, రెండు సారీలతో బిగ్ బాస్ నాలుగవ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగానే అలరించింది.