బిగ్ బాస్: ఎట్టకేలకు కెప్టెన్ అయిన లేడీ కమెడియన్..!

-

బిగ్ బాస్ ఆరవ సీజన్ మొదట్లో కాస్త బోరు కొట్టినా తర్వాత రోజుల్లో రోజురోజుకీ ఆసక్తి రేపుతూ కంటెస్టెంట్ల మధ్య రొమాన్స్ , లవ్ ఫైట్స్, గొడవలు ఇలా రకరకాలుగా సృష్టించి ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించారు బిగ్బాస్ నిర్వహకులు. ముఖ్యంగా ప్రేక్షకులలో ఆసక్తి టెన్షన్ పెంచుతూ ప్రోమోలు వదలడం, ఇంటి సభ్యుల మధ్య గొడవలు సృష్టించడం అన్నీ కూడా షోకే హైలైట్ గా నిలిచాయి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యుల మధ్య కెప్టెన్సీ కండెంటర్ టాస్క్ నడుస్తోంది. వారిలో స్నేక్స్ టీం నుంచి ఆదిరెడ్డి, రోహిత్ , ఫైమా, వాసంతి, కీర్తి, వాసంతి కంటెండర్ టాస్క్ కి వెళ్లారు.

కెప్టెన్సీ కంటెండర్లుగా మిగిలిన వారికి సంచాలకుగా రేవంత్ వ్యవహరించారు. వారిలో చివరిగా రోహిత్, ఆదిరెడ్డి , శ్రీ సత్య, ఫైమాలు పోటీ పడినట్లు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ 10వ వారం కెప్టెన్ గా ఫైమా నిలిచినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు జబర్దస్త్ నుంచి వచ్చిన ఈ లేడీ కమెడియన్ కెప్టెన్ అవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక నవంబర్ 10 వ వారం ఎపిసోడ్ నాటి రెండో ప్రోమోలో సింగర్ రేవంత్ చాలా డల్ గా కనిపించడం జరిగింది. దీంతో శ్రీ సత్య, శ్రీహాన్ ఓదార్చే ప్రయత్నం చేశారు. నిన్నటి ఆటలో తన తల పైన రేవంత్ ఉన్నాడని శ్రీ సత్య అరిచిన విషయం అందరికీ తెలిసిందే.. అందుకే బాధపడుతున్నాడేమో అని శ్రీ సత్య ఓదార్చే ప్రయత్నం చేసింది . కానీ ఎంత ఆడిన బూడిదలో పోసిన పన్నీర్ అయింది కదా అంటూ రేవంత్ వదిలిచ్చాడు.

కష్టపడి మట్టి తెచ్చి అందరికీ ఇచ్చినా ఫలితం దక్కలేదంటూ తనలో తానే బాధపడుతూ కనిపించాడు రేవంత్. మొత్తానికి అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి ఈవారం ఎలిమినేషన్స్ నుంచి సేఫ్ అయింది ఫైమా.

Read more RELATED
Recommended to you

Latest news