Bigg Boss 5: బిగ్ బాస్ లో బిగ్గెస్ట్ ట్వీస్ట్.. ఆ హాట్ బ్యూటీ రీఎంట్రీ!

-

Bigg Boss 5: బిగ్ బాస్ షో అంటేనే ట్వీస్టులు.. ఎవ్వ‌రూ ఊహించ‌ని చిత్ర విచిత్ర‌మైన‌ టాస్కులు. ఎప్పుడూ ఎవ్వ‌రిని సీక్రెట్ రూమ్ లోని పిలుస్తారో.. ఎప్పుడూ ఎవ్వ‌రిని ఎలిమినేట్ చేశారో అంత సస్పెన్స్ .. ఇలా ర‌క‌రకాల స‌ర్ ప్రైజ్ ల‌తో ఆస‌క్తికరంగా మార్చుతు ప్రేక్ష‌కుల మ‌న‌స్సును దోచుకుంటుంది బిగ్ బాస్ టీం. అందుకే ఈ రియాలిటీ షో ఎంతో ఆసక్తికరంగా మారుతూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది.

ఇప్పుడూ మ‌రో బిగ్గెస్ట్ ట్వీస్ట్ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నాడు బిగ్ బాస్.   అయితే.. గతంలో ఎన్నాడు లేని విధంగా ఐదో సీజ‌న్ ప్రారంభమైంది. ఈ సారి ఏకంగా 19 మంది ఏంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. నేడు ఎలిమినేష‌న్ ఘ‌ట్టం ఉండ‌టంతో ఈ వారం హౌస్ నుంచి ఎవ‌రూ వెళ్లిపోతున్నార‌నేది ఉత్కంఠగా మారింది. ఎవ‌రికి ఎన్ని ఓట్లు ప‌డుతున్నాయి? ఎవ‌రూ సేఫ్ గా ఉన్నాయ‌నేది ఈ రోజు తెలియ‌నున్న‌ది.

ఈ త‌రుణంలో మ‌రో ఇంట్రెస్టింగ్ టాఫిక్ తెర మీదికి వ‌చ్చింది. గ‌త సీజ‌న్లో ఎన్నాడూ లేని విధంగా.. ఈ సీజన్‌లో రీ ఎంట్రీలు ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే.. ఈ షోలో మార్పులు
వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండవన్న టాక్ వినిపించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆరుగురు ఎలిమినేట్ కాగా.. అందులో ఐదుగురు ఆడ‌వాళ్లే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఫిమేల్ కంటెస్టెంట్ రీఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. ఈ మేర‌కు నిర్వ‌హ‌కులు ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్.

ఇందుకు సంబంధించిన‌ న్యూస్ నెట్టింట్లో వైర‌ల్ అవుతుంది. ఔత్స‌హికులు మాత్రం ఓ అడుగు ముందుకేసి.. ఎవరు రీఎంట్రీ అయితే.. బాగుంటుందని పోల్స్ కూడా పెడుతున్నారు. రీఎంట్రీ తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివ‌ర‌కూ ఎలిమినేట్ అయినవారిలో హాట్ బ్యూటీ లహరి షారి త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతుందట. ఇప్పటికే దీనికి సంబందించిన చర్చలు జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. మరోవైపు.. ఇందులో భాగంగానే ఆమె బిగ్ బాస్ క్వారంటైన్‌లోకి వెళ్లేందుకు సిద్ద‌మవుతున్న‌ట్టు టాక్ ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news