దేశం లో నిత్య వసర వస్తువులతో పాటు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో సామన్య ప్రజలకు చుక్కలు చూస్తున్నారు. అయితే.. తాజాగా అగ్గిపెట్ట ధరలు కూడా పెరుగబోతున్నట్లు ఇవాళ ఉదయం నుంచి ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత.. మొదటి సారి అగ్గి పెట్టె ధరలు పెరుగుతున్నాయి.
అగ్గి పుల్లల తయారీలో ఉపయోగించే 14 రకాల ముడి పదార్ధాల ధరలు పెరగడమే దీనికి కారణమట. ప్రస్తుతం అగ్గిపెట్టెను రూపాయికి విక్రయిస్తుండగా… డిసెంబర్ 1 నుంచి 2 రూపాయకలు అమ్మనున్నట్లు తయారీ సంస్థలు ప్రకటించాయి.
అగ్గి పుల్ల తయారీఓ వినియోగించే రెడ్ ఫాస్పరస్, మైనం, బాక్స్ బోర్డులు, పేపర్ , పొటాషియం క్లోరేట్, గంధకం లాంటి వాటి ధరలు పెరగడంతో తామూ ధర పెంచక తప్పడం లేదని తయారీ దారులు చెబుతున్నారు. అగ్గిపెట్టే తయారీ దార్లకు సంబంధించి 5 సంఘాలు శివ కాశీ లో సమావేశమై… ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నాయి. కాగా.. చివరిసారి 2007 లో అగ్గిపెట్ట ధరను పెంచారు.