Bigg Boss 5: న‌టరాజ్ మాస్ట‌ర్ రీఎంట్రీ ! కట్లపాము, న‌ల్ల నక్క..స‌న్నీ షాకింగ్ కామెంట్స్!

-

Bigg Boss 5: బిగ్ బాస్ షో రోజురోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. టైటిల్ పోరులో కంటెస్టెంట్లంద‌రూ త‌మ శ‌క్తియుక్తులు ఒడిస్తున్నారు. ఈ త‌రుణంలో కంటెస్టెంట్ల మ‌ధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. మిని యుద్దాలే జ‌రుగుతున్నాయి. కొన్ని టాస్కులు ప‌రిధులును దాటుతున్నాయి. శృతి మించుతున్నాయి. టీఆర్పీ కోసం ఇంత‌లా ప్ర‌వ‌ర్తించాలా? అనే విమ‌ర్శలు వెల్లువెత్తున్నాయి. ప‌క్కా స్క్రీప్ ప్ర‌కార‌మే జ‌రుగుతుంది అనే అనుమానాలు వ‌స్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ వారం నామినేష‌న్ల ప‌ర్వం చాలా ఘాటుగా జరిగింది. మిని వ‌రల్డ్ వార్ ని త‌ల‌పించేలా.. అంత‌కు మించి అనేలా సాగింది. నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్ల తీరు శృతి మించింది. ప్ర‌ధాన కంటెస్టెంట్ అయిన స‌న్నీ.. ప్ర‌వ‌ర్త‌న చాలా విచిత్రంగా అనిపించింది. కంటెస్టెంట్ల‌ను రెచ్చ‌గొట్టేలా.. స‌న్సెష‌న‌ల్ కామెంట్స్ చేశారు. షోలోకి న‌ట‌రాజ్ తిరిగి వ‌చ్చారా? అనేలా స‌న్నీ కామెంట్ల పురాణం సాగింది. నటరాజ్ స్టైల్ లో తిట్టేశాడు.

నామినేష‌న్ టైంలో సిరి ష‌న్నుల‌కు గురించి మాట్లాడుతూ.. ష‌న్నును న‌ల్లన‌క్క అంటూ నటరాజ్ మాస్టర్ లాగే జంతువులతో పోల్చాడు సన్నీ. ఇక ఆనీ మాస్ట‌ర్ అయితే ఖచ్చితంగా పాము అని, ఇక సిరి దారుణంగా కట్లపాము తో పొల్చారు. ఇక తనకు తాను పేరు పెట్టుకోవాల్సి వ‌స్తే.. చింపాంజీ అని పేరు పెట్టుకుంటాననీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక నామినేషన్స్ ప్రక్రియ మొదలు కావడంతో సన్నీ మెడలో ఉన్న గిల్టీ బోర్డ్‌ ను తీసేయ్యాలని బిగ్ బాస్ యాంకర్ రవికి వివరణ ఇచ్చారు. గత ఎపిసోడ్ లో ర‌విని కుంట‌న‌క్క అని న‌ట‌రాజ్ మాస్ట‌ర్ పోల్చిన విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news