బిగ్‌బాస్ హౌస్‌లో ర‌చ్చ మాములుగా లేదు.. ఓ వైపు ఎలిమినేష‌న్లు .. ! మ‌రోవైపు వైల్డ్ కార్డు ఏంట్రీలు..!

బిగ్ బాస్ హౌస్‌లో కాంటెస్టెంట్ల రచ్చ మాములుగా లేదు. వారి పార్పామేస్‌తో రోజురోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. మొద‌టివారంతో పోల్చితే.. రెండో వారం హౌస్ చాలా హీటెక్కింది. హద్దులు దాటి ఒక్క‌రిపై ఒక్క‌రూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఎన్నో ఆశ‌ల‌తో వ‌చ్చినా సరయు మొదటి ఎలిమినేషన్ లోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది. కాగా.. మ‌రోవైపు నామినేష‌న్ సంబంధించిన ప్రోమో ఇప్పుడూ చాలా వైర‌ల్ అవుతుంది.

ఈ ప్రోమోలో శ్వేతా వ‌ర్మ రెచ్చిపోయింది. లోబో, కాజల్, హమీదలను ఓ రేంజ్‌లో క‌డిగిప‌డేసింది. మొత్తంపైన శ్వేత వ‌ర్మ హౌస్‌కు హ‌డ‌ల్తేచిందనే చెప్పాలి. కార్తీకదీపం ఉమా కూడా త‌న విశ్వ‌రూపం చూపించింది. హ‌నీ మాస్ట‌ర్ పై దూర్బాషలాడినట్టు క‌నిపిస్తుంది. ఏదో అస‌భ్య‌క‌ర మాట అన్న‌ట్టు వినిస్తోంది. దీంతో షన్ను ఒక్కసారిగా షాక్ అయినట్టున్నాడు. ఈ ప్రోమోను చూస్తే.. ఈ రోజు ఎపిసోడ్ మాత్రం ఓ రేంజ్‌లో ఉన్న‌ట్టు అనిపిస్తుంది. కంటెస్టెంట్ మంచి జోష్‌లో ఉన్న‌ట్టున్నారు.

ఇదిలా ఉంటే.. మ‌రోవైపు నామినేషన్ సభ్యుల లిస్ట్ కూడా వైర‌లవుతుంది. ఆ లిస్ట్‌లో కార్తీకదీపం ఉమాదేవీ, యానీ మాస్టర్, నటరాజ్, ప్రియాంక సింగ్, ప్రియ, ఆర్జే కాజల్, లోబోలు ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఉమాదేవి ఫైరింగ్ చూస్తే.. ఎలిమినేష‌న్ కాబోయేది ఆమెనే కావోచ్చనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఆమె త‌గ్గిన‌ట్టు తెలుస్తుంది. ఆ తరువాత స్థానంలో నటరాజ్ మాస్ట‌ర్ ఉంటారు. ఆయనకు ఓటింగ్ శాతం కూడా త‌గ్గిన‌ట్టు క‌నిపిస్తుంది.

ఇదేలా ఉంటే … హౌస్ లో మ‌రింత హీట్‌ను పెంచేందుకు బిగ్ బాస్ మ‌రో ఇద్ద‌రు హాట్ బ్యూటీల‌ను రంగంలోకి దించిన‌నున్న‌ట్టు తెలుస్తుంది. వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ చేయించ‌నున్నార‌ట. ఈ స్పెష‌ల్ ఏంట్రీ ద్వారా హౌస్‌లోకి వ‌చ్చేందేవ‌రనే అంశం కూడా చాలా వైర‌లవుతుంది. హౌస్ లోకి ఎవ్వ‌రూ రానున్నరో తెలుసుకోవడానికి చాలా ఆత్రుత‌గా వేచి చూస్తున్నారు. అందులో ఒక‌రూ హ‌ట్ బ్యూటీ, బుల్లితెర‌ యాంకర్ వ‌ర్షిణి కాగా.. మ‌రొక‌రు సీరియల్ హీరోయిన్ నవ్యస్వామి అని టాక్ వినిపిస్తోంది.

యాంకర్ వ‌ర్షిణి.. విష‌యానికి వ‌స్తే.. త‌న అందాచందాల‌తో, త‌న సొగుసైన మాటాల‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నది. అలాగే సోష‌ల్ మీడియాలో త‌రుచు త‌న హాటు అందాల‌ను ఆర‌బోస్తూ త‌న‌కంటూ ఓ రేంజ్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.

ఇక హీరోయిన్ న‌వ్వ‌స్వామి గురించి చెప్పాలంటే.. త‌న న‌ట‌న‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల మ‌న‌సులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నా పేరు మీనాక్షి, వాణి రాణి, ఆహ్వానం వంటి సీరియ‌ల్స్‌లో న‌టించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే.. వీరిద్ద‌రూ ఒక్కే సారి హౌస్‌లోకి వ‌స్తారా? లేదా ఒక్కొక్క వారం ఒక్కొక్క‌రు ఎంట్రీ ఇస్తారా? అనేది ఇంకా తెలియ‌ల్సి ఉంది. ఈ హ‌ట్ బ్యూటీస్ ఏంట్రీతో హౌస్ మ‌రింత క‌ల‌ర్ పూల్‌గా , గ్రామ‌ర్ గా క‌నిపించ‌నున్న‌ది.